Kohli vs Gambhir: ఐపీఎల్‌లో అగ్లీ సీన్స్! శ్రుతి మించిన కోహ్లీ, గంభీర్ వాగ్వాదం!
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో కొన్ని అగ్లీ సీన్స్ చోటు చేసుకున్నాయి. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఒకర్నొకరు దూషించుకున్నారు!
IPL 2023, Virat Kohli Gautam Gambhir Heated Exchage:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో కొన్ని అగ్లీ సీన్స్ చోటు చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఒకర్నొకరు దూషించుకున్నారు! కాస్త ఘాటుగానే మాటలు అనుకున్నట్టు కనిపిస్తోంది! ఇంతకీ ఏం జరిగిందంటే?
The calm before the storm - ft. Virat Kohli and Gautam Gambhir. pic.twitter.com/mxE6eTYzR7
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023
ఏకనా స్టేడియంలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Roayal Challengers Bangalore) తలపడ్డాయి. ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఛేదనలో లక్నో బ్యాటర్లు ఔటైన ప్రతిసారీ విరాట్ కోహ్లీ (Virat Kohli) అతిగా స్పందించాడు. ఎక్కువ యానిమేటెడ్‌గా కనిపించాడు. ఈ సీజన్ మొదటి మ్యాచులో చిన్నస్వామిలో లక్నో ఆఖరి బంతికి ఉత్కంఠకర విజయం సాధించింది. అప్పుడు ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి.. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నోర్మూసుకోండి అని సైగలు చేశాడు. ఇందుకు ప్రతీకారంగానే విరాట్ అతిగా స్పందించినట్టు అనిపిస్తోంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 1, 2023
మ్యాచు ముగిశాక గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒకర్నొకరు హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. దాంతో అంతా ప్రశాంతంగానే ఉందనిపించింది. కాసేపయ్యాక లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్.. కోహ్లీ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే గంభీర్ ఎంటరయ్యాడు. మేయర్స్‌ను పక్కు తీసుకెళ్లి ఏదో చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి ఏవో మాటలు అన్నాడు. దాంతో అతడు గంభీర్ దగ్గరికి వచ్చి దీటుగా ప్రతిస్పందించాడు. గొడవ పెద్దది అవుతుందనిపించడంతో రెండు జట్ల ఆటగాళ్లు, సపోర్ట్ స్టాప్ వారిద్దరినీ విడదీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Kyle Mayers was talking to Virat Kohli - Gautam Gambhir came and took Mayers away. pic.twitter.com/g3ijMkXgzI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇద్దరూ దిల్లీ క్రికెటర్లే! అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి వీరిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ రైవల్రీ ఉంది. ఎప్పుట్నుంచో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. ఒక మ్యాచులోనైతే ఒకర్నొకరు కొట్టుకొనేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థాయిలో కాకపోయిన మళ్లీ అవే సీన్స్ రిపీట్ అయ్యేలా కనిపించింది. గౌతీ, కోహ్లీని విడదీసిన తర్వాత కేఎల్ రాహుల్.. విరాట్ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. పరిస్థితి శ్రుతి మించకుండా చూశాడు.
Delhi boys pic.twitter.com/XOuM609RtS
— JAG19 (@GJA194) May 1, 2023
ఐపీఎల్ 2023 సీజన్ 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోరును కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మెన్‌లో కృష్ణప్ప గౌతం (23: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ (44: 40 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి.
— 🤞विशाल🤞 (@Visl___) May 1, 2023
KL Rahul trying to calm Virat Kohli. pic.twitter.com/DY68IGb1uV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023