News
News
వీడియోలు ఆటలు
X

Chennai Super Kings: ఆ లిస్ట్‌లో చెన్నైనే టాప్ - ఏకంగా 27 సార్లు!

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులను సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.

FOLLOW US: 
Share:

Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇప్పటివరకు మైదానంలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ సీజన్‌లో చెన్నై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచింది. దీని కారణంగా ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఐపీఎల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మిగిలిన సీజన్‌లతో పోలిస్తే 200 స్కోరు కూడా చాలా తేలికగా కనిపిస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నారని దీన్ని బట్టి స్పష్టంగా ఊహించవచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను 27 సార్లు సాధించగలిగింది. ఇది ఏ జట్టుకు అయినా అత్యధికం.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చెరో 19 సార్లు ఈ ఘనత సాధించాయి.

మరోవైపు ఐపీఎల్‌ 2023 సీజన్ 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించింది. చివరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒత్తిడితో పాటు మ్యాచ్‌ను కూడా జయించింది. ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ 201 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. చెపాక్ స్టేడియంలో అత్యధిక లక్ష్య ఛేదన ఇదే కావడం విశేషం.

పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా కృష్టి చేశారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ (42: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియాం లివింగ్‌స్టోన్ (40: 24 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరోవైపు సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది డెవాన్ కాన్వేకు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (37: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) బౌండరీలతో చెలరేగారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.ఆ తర్వాత కూడా వీరు వేగంగా ఆడారు. మొదటి వికెట్‌కు 86 పరుగులు జోడించిన అనంతరం సికందర్ రాజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన శివం దూబే (28: 17 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కాసేపు వేగంగా ఆడి అవుటయ్యాడు. మొయిన్ అలీ (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు), రవీంద్ర జడేజా (12: 10 బంతుల్లో) కూడా విఫలం అయినా మరో ఎండ్‌లో డెవాన్ కాన్వే బౌండరీలు కొట్టడం ఆపలేదు. ఒక దశలో సెంచరీ చేస్తాడు అనిపించినా చివరి ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వైడ్ యార్కర్లతో ఇబ్బంది పెట్టడంతో సాధ్యం కాలేదు. చివరి రెండు బంతులను సిక్సర్లు కొట్టిన మహేంద్ర సింగ్ ధోని (13 నాటౌట్:  4 బంతుల్లో, రెండు సిక్సర్లు) చెన్నై 200 పరుగులు మైలురాయిని అందుకునేలా చేశాడు.

Published at : 30 Apr 2023 10:08 PM (IST) Tags: Punjab Kings IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 Royal Challengers Bangalore

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?