By: ABP Desam | Updated at : 16 Mar 2023 08:07 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Image Source : WPL )
SRH New Jersey:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సరికొత్తగా కనిపించనుంది. రాబోయే సీజన్ కోసం వినూత్నంగా రూపొందించిన జెర్సీని విడుదల చేసింది. చివరి సారి విడుదల చేసిన జెర్సీపై విమర్శలు రావడంత ఈ సారి జాగ్రత్తలు తీసుకొంది. యువతను ఆకట్టుకొనేలా రూపొందించింది.
సరికొత్త జెర్సీకి సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒక వీడియోను రూపొందించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), జమ్మూ ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington sundar) ఇందులో నటించారు. కొత్త జెర్సీని ధరించి స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. 'ఇదిగో! మన ఆరెంజ్ ఆర్మీ సరికొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్నాం. ఆరెంజ్ ఫైర్ ఇది' అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
వాట్సాప్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ యాజమాన్యం ఒక జెర్సీ చిత్రాన్ని పంపించింది. దానికి ఈ ముగ్గురూ 'వద్దు' అంటూ జవాబిచ్చారు. ఆ తర్వాత జెర్సీ ఎలా ఉండాలో చెప్పారు. 'కూల్'గా ఉండాలని ఒకరు, 'ఫన్'గా మరొకరు, 'ఫైరీ'గా ఉండాలని ఇంకొకరు బదులిచ్చారు. ఆ తర్వాత తనుకులీనే నారింజ రంగు జెర్సీపై భుజాల వద్ద నల్లని చారలున్న జెర్సీని పరిచయం చేశారు. దానిని ధరించి పోజులు ఇచ్చారు. కొత్త జెర్సీపై ఐకానిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లోగో, టాటా ఐపీఎల్ లోగోలు ఉన్నాయి.
ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023
Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్
⦿ మ్యాచ్ 1: ఏప్రిల్ 2వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ (వేదిక)
⦿ మ్యాచ్ 2: ఏప్రిల్ 7వ తేదీ - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో
⦿ మ్యాచ్ 3: ఏప్రిల్ 9వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 4: ఏప్రిల్ 14వ తేదీ - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - కోల్‌కతా
⦿ మ్యాచ్ 5: ఏప్రిల్ 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 6: ఏప్రిల్ 21వ తేదీ - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై
⦿ మ్యాచ్ 7: ఏప్రిల్ 24వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 8: ఏప్రిల్ 29వ తేదీ - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ
⦿ మ్యాచ్ 9: మే 4వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 10: మే 7వ తేదీ - రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - జైపూర్
⦿ మ్యాచ్ 11: మే 13వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 12: మే 15వ తేదీ - గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - అహ్మదాబాద్
⦿ మ్యాచ్ 13: మే 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్
⦿ మ్యాచ్ 14: మే 21వ తేదీ - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 జట్టు
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సంవీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మే ఉపేంద్ర యాదవ్, , నితీష్ కుమార్ రెడ్డి, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
WPL 2023, UPW vs MIW: హర్మన్ ప్రీత్ సేన జైత్రయాత్ర, యూపీపై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!