News
News
వీడియోలు ఆటలు
X

SRH Vs LSG: లక్నోకు ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చిన రైజర్స్ - భారం బౌలర్లపైనే!

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

FOLLOW US: 
Share:

Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఐపీఎల్‌ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (47: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ సమద్ (37: 25 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) అతనికి చక్కటి సహకారం అందించాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాంలో ఉన్న అభిషేక్ శర్మ (7: 5 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (36: 27 బంతుల్లో, ఏడు ఫోర్లు), వన్ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (20: 13 బంతుల్లో, నాలుగు ఫోర్లు) బౌండరీలు కొడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. అయితే రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించాక రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి యష్ ఠాకూర్ లక్నోకు రెండో వికెట్ అందించాడు.

కాసేపటికే అన్‌మోల్ ప్రీత్ సింగ్ కూడా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (28: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్‌లను (0: 1 బంతి) కృనాల్ పాండ్యా వరుస బంతుల్లో అవుట్ చేసి రైజర్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 115 పరుగులు.

అయితే హెన్రిచ్ క్లాసెన్ (47: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), అబ్దుల్ సమద్ (37: 25 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ముఖ్యంగా సమద్ అయితే సిక్సర్లతో చెలరేగాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ అవుటైనా సన్‌రైజర్స్ డీసెంట్ స్కోరు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. యుధ్వీర్ సింగ్, అవేష్ ఖాన్, యష్ ఠాకూర్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ పడగొట్టారు.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధిస్తే నాలుగో స్థానంలోకి వెళ్లనుంది. సన్‌రైజర్స్ గెలిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఆరో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకూ ఈ విజయం చాలా కీలకం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
వివ్రంత్ శర్మ, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, నితీష్ కుమార్ రెడ్డి, మార్కో జాన్సెన్.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చారక్, అవేష్ ఖాన్

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
స్వప్నిల్ సింగ్, డేనియల్ సామ్స్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, అర్పిత్ గులేరియా.

Published at : 13 May 2023 05:27 PM (IST) Tags: SRH Sunrisers Hyderabad IPL Lucknow Super Giants LSG SRH Vs LSG IPL 2023 Indian Premier League 2023 IPL 2023 Match 58

సంబంధిత కథనాలు

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !