IPL 2024: రికార్డులను పట్టాల్సిందే, విజయం దక్కాల్సిందే
SRH vs GT, IPL 2024: ఐపీఎల్‌లో హైదరాబాద్-గుజరాత్ నాలుగుసార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో3 గుజరాత్ , ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి.
SRH vs GT Head to Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) హైదరాబాద్ ప్లే ఆప్‌లో స్థానం కోసం జరిగే పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 66లో గుజరాత్ టైటాన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs GT)తలపడనున్నాయి. హైదరాబాద్(Hyderabad)లో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్... ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దూరమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
గుజరాత్‌దే పైచేయి
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి హైదరాబాద్-గుజరాత్ నాలుగుసార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌పై హైదరాబాద్ ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఈ సీజన్‌లోనూ హైదరాబాద్‌పై గుజరాత్ విజయం సాధించింది.
గత మ్యాచ్‌లో ఇలా...
గుజరాత్(GT)తో జరిగిన ఆ పోరులో హైదరాబాద్ తేలిపోయింది. సమష్టి వైఫల్యంతో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని గుజరాత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పిచ్ రిపోర్ట్
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌లో పరుగులు సులువుగా వస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరాక్ మన్కడ్, అర్షద్ ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.