అన్వేషించండి
Advertisement
Ruturaj Gaikwad Record: సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ - ఇది మామూలు రికార్డు కాదుగా!
ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ కొత్త రికార్డు సాధించాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఐపీఎల్‌లో 1000 పరుగుల రికార్డు అందుకున్న ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు.
ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త ఘనత సాధించాడు. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 1000 పరుగుల మార్కును రుతురాజ్ గైక్వాడ్ చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్... సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ కూడా 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు.
ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో సురేష్ రైనా (34 ఇన్నింగ్స్), దేవ్‌దత్ పడిక్కల్ (35 ఇన్నింగ్స్), రిషబ్ పంత్ (35 ఇన్నింగ్స్), గౌతం గంభీర్ (36 ఇన్నింగ్స్) ఉన్నారు. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో అయితే సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో చేసిన 73 పరుగులే తన అత్యధిక స్కోరు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion