అన్వేషించండి

IPL 2024: రికార్డులోనూ రాయల్సే, పంజాబ్‌ ఏం చేస్తుందో ?

RR vs PBKS, 2024: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ రాజస్థాన్‌ రాయల్స్‌-పంజాబ్‌ కింగ్స్‌తో 27 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్‌ 16 మ్యాచుల్లో విజయం సాధించగా... పంజాబ్‌ 11 మ్యాచుల్లో విజయం సాధించింది.

RR vs PBKS IPL 2024 Head to Head Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) 2024లో 65వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(PBKS)తో రాజస్థాన్ రాయల్స్(RR) తలపడనుంది. గువహాటిలోని ఏసీఏ స్టేడియంలో  ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఐపీఎల్‌లో ఆరంభంలో అప్రతిహాత విజయాలతో దూసుకొచ్చిన రాజస్థాన్‌.... వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్‌ చూస్తోంది. ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ ఎనిమిది విజయాలు, 16 పాయింట్లు, +0.349 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దూరమైంది. పంజాబ్ ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు, ఎనిమిది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ రాజస్థాన్‌ రాయల్స్‌-పంజాబ్‌ కింగ్స్‌తో 27 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్‌ 16 మ్యాచుల్లో విజయం సాధించగా... పంజాబ్‌ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. గత అయిదు మ్యాచుల్లో రాజస్థాన్‌ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా.... పంజాబ్‌ ఒక మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్‌ రాయల్స్(RR) విజయం సాధించింది. ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో చివరి వరకూ విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించిన వేళ.. ప్రతీ పరుగుకు ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బ్యాటర్లలో అషుతోష్‌ శర్మ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌... చివరి ఓవర్‌లో విజయం సాధించింది. యశస్వీ జైస్వాల్‌ 39 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్‌లో విజయానికి రాజస్థాన్‌కు పది పరుగులు కావాల్సి ఉండగా హెట్‌మెయిర్‌ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. 

అధిక, తక్కువ స్లోర్లు ఇవే
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ అత్యల్ప స్కోరు 124కాగా... రాజస్థాన్‌ అత్యల్ప స్కోరు 112. ఈ రెండు జట్లు జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అత్యధిక పరుగులు సాధించాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు కూడా సంజు శాంసన్‌ పేరు మీదే ఉంది. శాంసన్‌ పంజాబ్‌పై 119 పరుగులు చేశాడు. చాహల్‌ నాలుగు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget