News
News
వీడియోలు ఆటలు
X

Rohit Sharma Birthday: రోహిత్‌.. నీలో ఈ యాంగిల్‌ ఉందా! హైదరాబాద్‌లో 60 ఫీట్ల కటౌట్‌!

Rohit Sharma Birthday: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ (Rohit Sharma) శర్మ నేడు 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు. క్రికెటర్లు, అభిమానులు అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Rohit Sharma Birthday: 

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ (Rohit Sharma) శర్మ నేడు 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు. క్రికెటర్లు, అభిమానులు అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు. అతడితో అనుబంధం, ఆత్మీయత గురించి పంచుకుంటున్నారు. యువరాజ్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌ అయితే స్పెషల్‌గా విషెస్‌ చెప్పారు.

ఇంటర్నేషనల్‌ క్రికెట్లో రోహిత్‌ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. వన్డేల్లో మూడు డబల్‌ సెంచరీలు చేసిన ఏకైక హీరో! ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో తిరుగులేని కెప్టెన్‌. ముంబయి ఇండియన్స్‌ను ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. తన కెరీర్లో మొత్తం ఆరు సార్లు ట్రోఫీ ముద్దాడాడు.

దేశంలో ఎక్కువ మంది అభిమానులు ఉన్న క్రికెటర్లలో హిట్‌మ్యాన్‌ ఒకడు. ముంబయిలోనే కాకుండా హైదరాబాద్‌లోనూ అతడికి భారీ అభిమాన గణం ఉంది. అందుకే 36వ పుట్టిన రోజులు సందర్భంగా నగరంలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. డబుల్‌ సెంచరీ కొట్టి బ్యాటుతో అభివాదం చేస్తున్నట్టు కనిపించే 60 ఫీట్ల కటౌట్‌ను రూపొందించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

రోహిత్‌ శర్మలోని సునిశిత హాస్య ధోరణిని యువరాజ్‌ సింగ్‌ బయట పెట్టాడు. టీమ్‌ఇండియాకు ఎంపికైన కొత్తలో ఎంతో సరదాగా ఉండేవాడని, అమాయకంగా కనిపించేవాడని అన్నాడు. ఇందుకు సంబంధించి ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 'ఫ్లో.. రైడా' అనే వ్యక్తిని 'ఫ్లోరిడా' అంటూ కామెడీ చేశాడని గుర్తు చేసుకున్నాడు. అతడి ఫన్నీ సన్నివేశాలతో కూడిన వీడియోకు 'ఊ.. అంటావా మామా! ఊ..ఊ అంటావా మామ' ఆడియోను జత చేశాడు.

'ఈ ప్రపంచంలో నాకు అత్యంత ప్రియమైన సోదరుడికి హ్యాపీ బర్త్‌డే.  నా మార్గదర్శి, బెస్ట్‌ ఫ్రెండ్‌, ఇతరుల కన్నా నన్ను ఎక్కువ నవ్వించే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే రోహితా.. శర్మా..! సీసీ: రితికా సజ్దే బాబీ' అంటూ యుజ్వేంద్ర చాహల్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు 'ఇప్పటికే నా భర్తను దోచుకున్నావు. ఇప్పుడిక నా కెప్టెన్‌ను కూడా దోచేస్తావా' అని రితికా బదులిచ్చింది. ముంబయి ఇండియన్స్ సైతం రోహిత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

Published at : 30 Apr 2023 01:38 PM (IST) Tags: Mumbai Indians ROHIT SHARMA Rohit Sharma Birthday Hit man

సంబంధిత కథనాలు

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!