అన్వేషించండి
Advertisement
IPL 2024: 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్, రాణించిన ఆర్సీబీ బౌలర్లు
RCB vs GT, IPL 2024: బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చివరి ఓవర్లలో వరుసగా మూడు వికెట్లు పడటంతో దీంతో 19.3 ఓవర్లలో గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది.
RCB vs GT IPL 2024 Royal Challengers Bengaluru target 148: ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ఆవిరైన వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు బౌలర్లు ఫామ్‌లోకి వచ్చారు. ఆరంభంలో పూర్తిగా తేలిపోయిన బెంగళూరు బౌలర్లు.. గత కొన్ని మ్యాచుల్లో రాణిస్తున్నారు. గుజరాత్(GT)తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ బెంగళూరు బౌలర్లు మెరిశారు. బెంగళూరు బౌలర్లు మెరవడంతో గుజరాత్ కీలకమైన మ్యాచ్‌లో దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్, యష్ దయాల్, విజయ్‌కుమార్ సహా బెంగళూరు బౌలర్లు రాణించారు.
ఆరంభం నుంచే కట్టడి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు... పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నిర్ణయం సరైందేనని కాసేపటికే అర్థమైంది. ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్వప్నిల్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. రెండో ఓవర్‌లోనే గుజరాత్‌కు షాక్ ఇచ్చింది. ఏడు బంతుల్లో ఒక పరుగు చేసిన వృద్ధిమాన్ సాహాను మహ్మద్ సిరాజ్ వేశాడు. కీపర్ దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి... సాహా అవుటయ్యాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ తొలి మూడు ఓవర్లలో ఏడు పరుగులే చేయగలిగింది. నాలుగో ఓవర్‌లో సిరాజ్ మరో వికెట్ తీశాడు. శుభ్‌మన్ గిల్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. రెండు పరుగులకే గిల్ అవుట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఆరో ఓవర్‌లో మరో వికెట్ పడింది. సాయి సుదర్శన్ అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లేలో గుజరాత్ కేవలం 23 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. 19 పరుగులకే మూడూ వికెట్లు కోల్పోయిన డేవిడ్ మిల్లర్, షారూఖ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో కాస్త కుదురుకున్నాక స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దీంతో పదో ఓవర్‌లో గుజరాత్ 50 పరుగుల మార్క్ దాటింది. నాలుగో వికెట్‌కు విలువైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 20 బంతుల్లో 30 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ అవుట్ కావడంతో గుజరాత్‌కు మరో షాక్ తగిలింది.
మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో మిల్లర్ అవుటయ్యాడు. ఆ తర్వాత వెంటనే షారూఖ్ ఖాన్ అవుటయ్యాడు. 24 బంతుల్లో 37 పరుగులు చేసిన షారూఖ్ ఖాన్ అవుటయ్యాడు. షారూఖ్ రనౌట్ అయ్యి నిరాశగా వెనుదిరిగాడు. కోహ్లీ సూపర్ త్రోకు షారూఖ్ వెనుదిరగగా తప్పలేదు. కర్ణ్ శర్మ వేసిన 16వ ఓవర్‌లో తెవాటియా దాటిగా ఆడాడు. ఈ ఓవర్‌లో తెవాటియా 18 పరుగులు రాబట్టాడు. కానీ యష్ దయాల్ వేసిన ఓవర్‌లో రషీద్ ఖాన్ అవుటయ్యాడు. 18 పరుగులు చేసి రషీద్ అవుటయ్యాడు. 21 బంతుల్లో 35 పరుగులు చేసి తెవాటియా అవుటయ్యాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు, యష్ దయాల్ రెండు, విజయ్ కుమార్ రెండు వికెట్లు తీశారు. దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా రివ్యూ
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion