News
News
వీడియోలు ఆటలు
X

RCB Vs CSK: మ్యాక్స్‌వెల్, డుఫ్లెసిస్ భయపెట్టినా - చెన్నైదే విజయం!

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఎనిమిది పరుగులతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

Royal Challengers Bangalore vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది పరుగులతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 218 పరుగులకు పరిమితం అయింది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రాణించినా బెంగళూరును గెలిపించలేకపోయారు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (83: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివం దూబే (52: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు.

227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (6: 4 బంతుల్లో, ఒక ఫోర్), వన్‌డౌన్ వచ్చిన మహిపాల్ లొమ్రోర్ (0: 5 బంతుల్లో) రెండు ఓవర్లలోనే వెనుదిరిగారు. దీంతో బెంగళూరు 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే కెప్టెన్, మరో ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) బెంగళూరును దాదాపు గెలిపించినంత పని చేశారు. వీరు మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 136 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ వరుస ఓవర్లలోనే అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. దినేష్ కార్తీక్ (28: 14 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టాడు. మతీష పతిరాణా రెండు వికెట్లు తీసుకున్నాడు. మొయిన్ అలీ, మహీష్ తీక్షణ, ఆకాష్ సింగ్‌లకు తలో వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరంభంలోనే చెన్నైకి ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను (3: 6 బంతుల్లో) మహ్మద్ సిరాజ్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టించాడు. కానీ మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (83: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ అజింక్య రహానే (37: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెన్నై ఇన్నింగ్స్‌ను పరుగులెత్తించారు. వీరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో రహానేను క్లీన్ బౌల్డ్ చేసి వనిందు హసరంగ బెంగళూరుకు రెండో వికెట్ అందించాడు.

ఆ తర్వాత డెవాన్ కాన్వేకు శివం దూబే (52: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) తోడయ్యాడు. ఈ జోడి విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం విశేషం. బెంగళూరు బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 37 బంతుల్లోనే మూడో వికెట్‌కు వీరు 90 పరుగులు జోడించారు. ఈ దశలో డెవాన్ కాన్వే, శివం దూబే వెంట వెంటనే అవుట్ అయ్యాక చెన్నై వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. కానీ వచ్చిన వారంతా వేగంగా ఆడటంతో స్కోరు వేగం మాత్రం తగ్గలేదు. చివరి ఓవర్‌ను హర్షల్ పటేల్ ప్రారంభించాడు. కానీ రెండు బీమర్లు వేయడంతో బౌలింగ్‌ను మ్యాక్స్‌వెల్‌కు అప్పగించారు. ఈ ఓవర్లో కూడా 16 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హర్షల్ పటేల్, వనిందు హసరంగ, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.

Published at : 17 Apr 2023 11:28 PM (IST) Tags: RCB CSK IPL IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 Royal Challengers Bangalore RCB Vs CSK IPL 2023 Match 24

సంబంధిత కథనాలు

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?