IPL 2025 Qualifier 1 PBKS VS RCB: ప్లే ఆఫ్స్ కు పటిష్ట భద్రత.. అభిమానులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు.. పంజాబ్ పోలీసు యంత్రాంగం ప్రకటన
మరో 4 మ్యాచ్ ల తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ ముగియబోతోంది. ఇప్పటివరకు లీగ్ దశ కాగా, ఇంకా క్వాలిఫయర్ 1, 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇవి అహ్మదాబాద్, ముల్లన్ పూర్ లో జరుగుతాయి.

IPL 2025 Play Offs News: ప్రపంచలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్ లు ముగిశాక, కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో భాగంగా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు పంజాజ్ ఉమ్మడి రాజధాని నగరం చంఢీగడ్ సమీపంలోని ముల్లన్ పూర్ లో జరుగుతాయి. గురువారం క్వాలిఫయర్ 1, శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ఈ మ్యాచ్ ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ప్రకటించింది. మ్యాచ్ ల నిర్వహణ కోసం పగడ్బందీ ఏర్పాట్ల చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు తెలిపింది.
𝐓𝐡𝐞 𝐰𝐚𝐢𝐭. 𝐓𝐡𝐞 𝐟𝐢𝐠𝐡𝐭. 𝐓𝐡𝐞 𝐝𝐫𝐞𝐚𝐦. 𝐀𝐥𝐥 𝐥𝐞𝐚𝐝𝐬 𝐡𝐞𝐫𝐞 🔥#PBKS & #RCB are just 1⃣ win away from a place in the #TATAIPL 2025 finals 😬
— IndianPremierLeague (@IPL) May 28, 2025
Who's making it through? 🤔#PBKSvRCB | #TheLastMile | @PunjabKingsIPL | @RCBTweets pic.twitter.com/1eiHt3oE34
మాక్ డ్రిల్..
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమం లో భద్రతను కట్టుదిట్టంగా చేసినట్లు పోలీసు యంత్రాంగం తెలిపింది. ఈ రెండు మ్యాచ్ లను చూసేందుకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు స్టేడియాలకు వస్తారని, వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు స్పెషల్ డీజీపీ అర్ఫిత్ శుక్లా తెలిపారు. ఇప్పటికే భద్రతకు సంబంధించి పలు సమావేశాలు నిర్వహించి, మాక్ డ్రిల్ ను కూడా కంప్లీట్ చేసినట్లు తెలిపారు. భద్రత కోసం 56 మంది గెజిటెడ్ ఆఫీసర్లతోపాటు 2500 మందితో రక్షణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈసారి ఫైనల్లో ఒక నాన్ చాంపియన్ ఉండబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
𝙑𝙧𝙤𝙤𝙢𝙞𝙣𝙜 𝙞𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙋𝙡𝙖𝙮𝙤𝙛𝙛𝙨 🏁
— IndianPremierLeague (@IPL) May 28, 2025
Get ready folks for a ride into 𝙏𝙝𝙚 𝙇𝙖𝙨𝙩 𝙈𝙞𝙡𝙚 🏎#TATAIPL | #TheLastMile pic.twitter.com/b7p2nqQ864
ఫైనల్ కు సై..
ఇక క్వాలిఫయర్ 1కు అర్హత సాధించిన ఆతిథ్య పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు.. గురువారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు అర్హత సాధించనుంది. దీంతో ఈ సారి ఫైనల్లో ఒక నాన్ చాంపియన్ జట్టును చూడనున్నామని విశ్లషకులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు క్వాలిఫయర్ 2ను అహ్మదాబాద్ వేదికగా జూన్ 1న ఆడుతుంది. అంతకుముందు ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్ కూడా అహ్మదాబాద్ వేదికగా జూన్ 3న జరుగుతుంది.




















