LSG No Ball Saves RCB Run out Controversy | IPL 2025 లో ఆర్సీబీని క్వాలిఫైయర్ కి పంపేలా LSG తప్పులు
ఆర్సీబీ 228 పరుగులను ఛేజ్ చేసే క్రమంలో బోలెడంత డ్రామా నడిచింది. ప్రధానంగా కొహ్లీ అయిపోయిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి ఎప్పుడైతే జితేశ్ శర్మ పోరాటం మొదలు పెట్టాడో అది మరింత పీక్స్ కి వెళ్లింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇన్నింగ్స్ 17వ ఓవర్ గురించి. అప్పటికి RCB ఇక 24 బాల్స్ లో 39 పరుగులు చేస్తే చాలు. అలాంటి టైమ్ లో జితేశ్ శర్మ 49 పరుగులతో ఉన్నప్పుడు బౌలింగ్ కి వచ్చిన దిగ్వేష్ రాఠీ వేసిన మొదటి బంతికే ఆయష్ బడోనికి క్యాచ్ ఇచ్చేశాడు జితేశ్ శర్మ. పాపం నోట మాటలేదు జితేశ్ కి. ఇటు వైపు దిగ్వేష్ ఏమో ఫైన్ లు వేస్తున్నారు గడ్డి మీద చీటి రాసి చింపటం మొదలు పెట్టాడు. అప్పటి వరకూ అంత కష్టపడి ఆడి 49 పరుగులకు అవుట్ అయిపోవటం జితేశ్ కి ఒక బాధ అయితే...ఆ టైమ్ లో వికెట్ పడితే మ్యాచ్ లయ దెబ్బ తింటుంది...LSG గేమ్ లోకి వచ్చేసే ప్రమాదం ఉంది. పెద్ద బ్యాటర్లు ఎవరూ లేరు కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ తప్ప..ఆ టైమ్ లో బడోనీ పట్టిన క్యాచ్ బాగా లోగా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ కి థర్డ్ అంపైర్ కి క్యాచ్ గురించి క్లారిటీ అడిగాడు. అప్పుడే తేలింది ఏంటంటే దిగ్వేష్ రాఠీ సైడ్ నోబ్ వేశాడు. దిగ్వేష్ బ్యాక్ ఫుట్ సైడ్ లైన్ కి టచ్ అవటంతో రూల్స్ ప్రకారం అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ రావటంతో తర్వాతి బంతికి సిక్సర్ బాదిన జితేశ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి సింహనాదం చేశాడు. మళ్లీ అదే ఓవర్ చివరి బంతికి మరో డ్రామా. ఈ సారి నాన్ స్టైకింగ్ ఎండ్ లో ఉన్నాడు జితేశ్ శర్మ. మయాంక్ అగర్వాల్ కి దిగ్వేష్ రాఠీ బాల్ వేయాలి. అయితే బౌలింగ్ యాక్షన్ ను సడెన్ గా ఆపేసిన దిగ్వేష్ అప్పటికే జితేశ్ క్రీజ్ లైన్ నుంచి బయటకు రావటంతో మన్కడింగ్ చేసి అంపైర్ కి అప్పీల్ చేశాడు. దీంతో థర్డ్ అంపైర్ కి వెళ్లాడు ఫీల్డ్ అంపైర్ ...మన్కడింగ్ ప్రాపర్ గా చేశాడా లేదా చూడటానికి. వాస్తవానికి నిబంధనల ప్రకారం మన్కడింగ్ చేయాలంటే బౌలింగ్ యాక్షన్ మొదలు పెట్టడానికి ముందేనో..లేదా కంప్లీట్ చేయకముందో చేయాలి. వన్స్ బౌలర్ తన బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేశాడు అంటే బంతిని వేయాల్సిందే..మన్కడింగ్ చేయటానికి ఉండదు. ఆ రకంగా జితేశ్ శర్మ నాటౌట్ గా థర్డ్ అంపైర్ ప్రకటించటానికి సిద్ధమవుతున్న టైమ్ లో...LSG కెప్టెన్ తన డెసిషన్ ను మార్చుకున్నాడు. మన్కడింగ్ అప్పీల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు అంపైర్ కి చెప్పాడు. దీంతో అసలు గొడవేలేదని థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఆ రకంగా రెండోసారి జితేశ్ కి లైఫ్ వచ్చింది. జితేశ్ కూడా ఎమోషనల్ అయ్యి పంత్ ను హగ్ చేసుకున్నాడు. ఓ రకంగా ఆర్సీబీ డూ ఆర్ డై లా ఫీలవుతున్న మ్యాచ్ లో దిగ్వేష్ రాఠీ బౌలింగ్ లో తను చేసిన రెండు చిన్న తప్పులు LSG కి విజయాన్ని దూరం చేసి RCB కి లాభం చేశాయనే చెప్పాలి.





















