అన్వేషించండి

T20 World Cup 2024: న్యూయార్‌ వేదికగా దాయాదుల సమరం!

T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ న్యూయార్‌లో జరిగే అవకాశం ఉంది. భారత్‌కు న్యూయార్క్‌కు మధ్య కాలమానంలో తేడా బట్టి మ్యాచ్ టైమ్ భారత్‌ అభిమానులకు అనువుగా ఉండేటట్లు ఐసిసి ప్లాన్ చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్‌ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. పురుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్‌ లోగోల‌ను విడుద‌ల చేసింది. ఇక ఈ ప్రపంచకప్‌నకే  హైలెట్‌గా నిలిచే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ న్యూయార్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కప్‌లో తలపడుతున్న పది జట్లలో కొన్ని జట్లు తమ గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడే అవకాశాలున్నాయి. వీటిలో భారత్‌, పాకిస్థాన్‌ ఉండొచ్చని తెలిసింది. 

భారత్‌కు న్యూయార్క్‌కు మధ్య కాలమానంలో పదిన్నర గంటలు తేడా ఉండడంతో భారత్‌లో అభిమానులకు అనువుగా ఉండేటట్లు ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. టోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్‌, అమెరికాల్లోని వేదికల్లో ఐసీసీ బృందం ఇప్పటికే పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించింది. విండీస్‌లో కొన్ని వేదికలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంది. 

2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి. 

వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించాలనే అభిప్రాయాలు ఎక్కువ మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి బీసీసీఐ సెక్రటరీ జై షా తొలిసారి స్పందించారు. మళ్లీ రోహిత్ టీ20 ఫార్మాట్లోకి పునరాగమనంపై జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ పునరాగమనంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని జైషా చెప్పారు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ జూన్‌లో జరగనుందని.... అంతకన్నా ముందు తమకు ఐపీఎల్, అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ ఉందని బీసీసీఐ కార్యదర్శి గుర్తు చేశాడు. బెంగళూరులో కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ వచ్చే ఏడాది ఆగష్టులో ప్రారంభం అవుతుందని జై షా వెల్లడించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget