Mumbai Indians vs Punjab Kings match: ఆగిన వర్షం, క్వాలిఫయర్ 2 మ్యాచ్ ప్రారంభం.. ముంబైలో చిగురించిన ఆశలు
అహ్మదాబాద్‌లో కురిసిన వర్షం ముంబై ఇండియన్స్ జట్టును ఆందోళనకు గురిచేసింది. కొన్ని నిమిషాల్లోనే వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ముంబైలో ఆశలు చిగురించాయి.

Mumbai Indians vs Punjab Kings Match: ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి సరిగ్గా మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం పడటంతో పిచ్, థర్టీ యార్డ్ సర్కిల్ వరకు కొంతమేర కవర్లతో కప్పి ఉంచారు. కొన్ని నిమిషాల కిందట వర్షం ఆగిపోయింది. దాంతో అంపైర్లు పరిశీలించారు. 8.25కు మ్యాచ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. కానీ వర్షం పడటంతో 9.45కి మ్యాచ్ ప్రారంభమైంది. ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది.
9.45 to 11.15 - ఫస్ట్ ఇన్నింగ్స్
11.15 to 11.25 - break
11.25 to 12.55 - సెకండ్ ఇన్నింగ్స్
వర్షం నిలిచిపోగానే ముంబై ఇండియన్స్ జట్టులో ఆశలు చిగురించాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ చేరేది. ఎందుకంటే లీగ్ స్టేజీని నెంబర్ వన్ గా పంజాబ్ ముగించగా.. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించాలని ఐపీఎల్ రూల్స్ చెబుతున్నాయి.
🚨 Update from Ahmedabad 🚨
— IndianPremierLeague (@IPL) June 1, 2025
Play to resume at 8:25 PM IST.#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile https://t.co/O1wFiN7szK
అసలే కలిసిరాని స్టేడియం, అందులోనూ వర్షం..
ముంబై ఇండియన్స్‌కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గత మూడేళ్లలో ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. నేటి కీలక మ్యాచ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఫైనల్ చేరాలని భావిస్తున్న ముంబై జట్టును వర్షం వణికిస్తోంది. వర్షం ఇలాగే కొనసాగితే, మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాకపోతే ముంబై సీజన్ నుంచి నిష్క్రమించగా.. పంజాబ్ ఫైనల్ చేరుతుంది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI
రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, రాజ్ బావా, జస్‌ప్రీత్ బుమ్రా, రీస్ టోప్లీ.
ఇంపాక్ట్ ప్లేయర్- అశ్వనీ కుమార్.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI
ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, స్టోయినిస్, అజ్మతుల్లా ఓమర్ జాయ్, కైల్ జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, యుజ్వేంద్ర చాహల్.





















