News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023: ఫస్ట్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేడు (మార్చి 31 శుక్రవారం) చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. లీగ్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది.

FOLLOW US: 
Share:

Gujarat Titans vs Chennai Super Kings: హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ శుక్రవారం జరిగే ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ధోని గాయపడటంతో చెన్నై సమస్యల్లో పడింది. 

చెన్నైలో ప్రాక్టీస్ సెషన్‌లో 41 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఎడమ మోకాలికి గాయమైంది. ఈ విషయంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ను ప్రశ్నించగా,'నాకు సంబంధించినంత వరకు కెప్టెన్ 100 శాతం ఆడతాడు. జరుగుతున్న పుకార్లు గురించి నాకు తెలియదు.

ధోనీని తన మెంటార్‌గా పలుమార్లు అభివర్ణించిన పాండ్యా మరోసారి ధోనీని ఎదుర్కోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. గత సీజన్‌లో శిష్యుడు పాండ్యా జట్టు ధోనీ జట్టును రెండుసార్లు ఓడించింది. 

శుభ్మన్ గిల్ తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నాడు. రషీద్ ఖాన్ నిలకడ తగ్గలేదు. గత ఐపీఎల్‌లో గాయం నుంచి కోలుకున్న పాండ్యా తన ఫిట్నెస్‌తోపాటు బంతి, బ్యాట్‌తో సమర్థవంతంగా రాణిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌కు అనుభవజ్ఞుడైన డేవిడ్ మిల్లర్‌ తుది జట్టులో లేకుండా పోయాడు. కానీ రాహుల్ తెవాటియా కొంతకాలంగా బ్యాట్‌తో బాగా రాణిస్తున్నాడు. ఈ లోటును అతను పూడ్చే ఛాన్స్ ఉంది. ఈ జట్టులో న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. ఈ ఫార్మాట్ లో అతను అంత ప్రమాదకరమైన బ్యాటర్‌. 

మరోవైపు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ధోనీ వయసు 42 ఏళ్లు అయినా కెప్టెన్సీ పరంగా అతడికి విరామం లేదు. గత సీజన్‌లో వారి ప్రణాళికలు సమర్థవంతంగా ఉన్నప్పటికీ వాటి అమలు సరిగా లేకపోవడంతో ఓటమిపాలయ్యారు.

శుక్రవారం నుంచి 16వ సీజన్ ప్రారంభం కానుండటంతో పోటీలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన కారణంగా ఈ మ్యాచ్లో 12 మంది ఆటగాళ్లు ఆడతారు. తన వనరులను చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించే ధోనీ అవసరమైతే తనను తాను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా కూడా మార్చుకోవచ్చు.

చెన్నై తరఫున బెన్ స్టోక్స్ ఉండటం కచ్చితంగా ప్రత్యర్థిని కలవరపెడుతుంది, కానీ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ గుజరాత్ టైటాన్స్పై బౌలింగ్ చేయడు. జట్టు స్టార్టింగ్ ఎలెవన్లో డెవాన్ కాన్వే, స్టోక్స్, మొయిన్ అలీ వంటి విదేశీ ఆటగాళ్లు ఉంటారు.

అయితే రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, ధోనీ బ్యాట్‌తో ఎలా రాణిస్తారనే దానిపైనే జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. స్పిన్నర్ మహేశ్ తిక్ష్నా, లసిత్ మలింగ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా ప్రత్యర్థులకు కలవరపాటుకు గురి చేస్తారు. 

గుజరాత్ జట్టులో మహ్మద్ షమీ తప్ప నమ్మదగిన ఇండియన్‌ ఫాస్ట్ బౌలర్ లేడు. శివమ్ మావి జట్టులోకి వచ్చినప్పటికీ జోష్ లిటిల్‌ను తప్పించాలనే నిర్ణయం అర్థం లేని పని. భారత పిచ్‌లలో అల్జారీ జోసెఫ్ ఎంతవరకు ప్రభావితం చేస్తాడో చూడాలి.

గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, కోన భారత్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మహ్మద్ షమీ, ప్రదీప్ సంగ్వాన్, ఆర్ సాయి కిషోర్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, శివమ్ మావి, మాథ్యూ వేడ్, ఒడియన్ స్మిత్, ఉర్విల్ పటేల్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్ (మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో లేడు), జోష్ లిటిల్ (తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు). యశ్ దయాళ్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, అల్జారీ జోసెఫ్.

చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, అజింక్య రహానె, సిసందా మగాలా, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్, అహ్యా మొండల్, నిశాంత్ సింధు, రాజవర్ధన్ హంగర్గేకర్, మిచెల్ శాంట్నర్, సుభ్రంగ్షు సేనాపతి, సిమ్రన్జీత్ సింగ్, మథిసా పతిరానా, మహేష్ .

Published at : 31 Mar 2023 09:18 AM (IST) Tags: CSK MS Dhoni Indian Premier League CSK Vs GT IPL 2023 Gujarat Titans vs Chennai Super Kings

సంబంధిత కథనాలు

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!