అన్వేషించండి

IPL 2024: లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం, టేబుల్ టాపర్ గా శాంసన్ సేన

LSG vs RR, IPL 2024: లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం సాధించింది .

LSG vs RR IPL 2024 Rajasthan Royals won by 7 wkts: లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో   లక్నో(LSG)పై రాజస్థాన్‌(RR) ఘన విజయం సాధించింది .  లక్నో ఇచ్చిన లక్ష్యాన్నిరాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది . మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.  దానిని రాజస్థాన్‌ సమర్ధవంతంగా ఛేదించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్‌ బ్యాటర్లలో సంజు శాంసన్‌  , ధ్రువ్‌ జురెల్ లు  అర్ధశతకాలతో చెలరేగిపోయారు. జోస్‌ బట్లర్‌ , జైస్వా్‌ల్‌ కూడా  రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ 1, మార్కస్‌ స్టాయినిస్‌ 1, అమిత్‌ మిశ్రా 1 వికెట్ తీశారు.

రాజస్థాన్ ఇన్నింగ్స్..

197 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన రాజస్థాన్‌  పవర్ ప్లే లోపే ఇద్దరు  ఓపెనర్లఅను కోల్పోయింది.  తొలి బంతికి జైస్వాల్‌ ఒక్క పరుగుతో ఆట మొదలు పెట్టాడు. ఓవైపు జైస్వాల్‌, మరో వైపు బట్లర్‌ క్రీజులో నిలదొక్కుకుంటూ పరుగులు రాబడుతుండగా ఆరో ఓవర్‌లో యశ్ ఠాకూర్‌ వేసిన  ఐదో బంతికి జోస్ బట్లర్  ఔటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద రాజస్థాన్‌ తొలి వికెట్ కోల్పోయింది. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 60/1. 

ఆరవ ఓవర్ కు బౌలింగ్ కి  దిగిన మార్కస్ స్టాయినిస్‌ తన స్పెల్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టాడు.  అతడు వేసిన 6.1 ఓవర్‌కు యశస్వి జైస్వాల్ రవి బిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.  తరువాత 9 వ ఓవర్ లో రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా వేసిన  మూడో బంతికి లాంగాన్‌ మీదుగా సిక్స్ బాదిన పరాగ్.. తర్వాతి బంతికే బదోనికి క్యాచ్‌ ఇచ్చాడు14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రియాన్‌ పరాగ్  ఔటయ్యాడు. తరువాత నిలకడగా ఆడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ  శాంసన్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ  18 వ ఓవర్లో  అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు.  లక్నో ఇచ్చిన 197  పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది

లక్నో ఇన్నింగ్స్..

మ్యాచ్ లోటాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ తో  జరిగిన మ్యాచ్ లో మొదట్లో లక్నో తడబడినా ఆ తర్వాత నిదానంగా స్కోర్ బోర్డ్ ను పరుగెత్తించింది.  తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన డికాక్‌  ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన బంతికి బౌల్డ్‌  అయ్యాడు . తరువాత రెండవ ఓవర్ లోనే  మార్కస్‌ స్టాయినిస్‌   ఎలాంటి పరుగులు చేయకుండా పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. 

కెప్టెన్ కేఎల్ రాహుల్  48 బంతులలో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అలాగే , దీపక్ హుడా కూడా 31 బంతులలో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు . ఇద్దరు అర్ధ సెంచరీలతో చెల‌రేగారు. నికలోస్ పురన్ 11 పరుగులు చేయగా  పరుగులతో ఆయుష్ బదోని, 16 పరుగులతో కృనాల్ పాండ్యా  అజేయంగా నిలిచారు. ఇక రాజస్థాన్ బౌలర్స్ విషయానికి కొస్తే.. సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా.., ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget