అన్వేషించండి

IPL 2024 : టాస్‌ గెలిచిన లక్నో, రాహుల్‌ మెరుస్తాడా ?

LSG vs PBKS, IPL 2024 : మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌లో సత్తా చాటాలని కె.ఎల్‌.రాహుల్‌ సేన వ్యూహాలు రచిస్తోంది.

IPL 2024 LSG vs PBKS  LSG chose to bat : ఐపీఎల్‌(IPL)లో  లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSK) పంజాబ్‌(PBKS) మధ్య కీలక పోరు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌లో సత్తా చాటాలని కె.ఎల్‌.రాహుల్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. కృనాల్ పాండ్యా మినహా మిగిలిన లక్నో బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

బలహీనంగా లక్నో బౌలింగ్‌
మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ లేకపోవడంతో లక్నో పేస్‌ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్సిన్ ఖాన్ నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒకే వికెట్ తీయగా... నవీన్‌ ఉల్‌ హక్‌ 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. యష్‌ ఠాకూర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కుడా తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు. కృనాల్ పాండ్యా ఒక్కడే 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఈ బౌలింగ్‌ వైఫల్యమే లక్నోను ఆందోళన పరుస్తోంది.


రాబోయే టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్న రవి బిష్ణోయ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం లక్నో జట్టును ఆందోళన పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో 58 పరుగులతో పర్వాలేదనిపించిన కెప్టెన్‌ రాహుల్‌.. క్వింటన్‌ డికాక్‌తో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నాడు. పంజాబ్‌పై అత్యుత్తమ ఆటతీరు కొనసాగించాలని ఈ ఓపెనింగ్‌ జోడీ చూస్తోంది. దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా కూడా రాణించాలని లక్నో కోరుకుంటోంది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై లక్నో భారీ ఆశలు పెట్టుకుంది. గత ఏడాది ఐపీఎల్‌లో  408 పరుగులు చేసిన స్టోయినీస్‌.. ఈసారి అత్యధిక పరుగులు చేయాలని చూస్తున్నాడు.

పంజాబ్‌ జోరు సాగేనా..?
ఇప్పటివరకూ రెండు మ్యాచులు ఆడి ఒక విజయం నమోదు చేసిన పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయ యాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని జట్టు పవర్‌ప్లేలో మరింత ధాటిగా ఆడాలని చూస్తోంది. జానీ బెయిర్‌స్టో ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌కు ఇది కష్టం కాకపోవచ్చు. ధావన్ తన స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బెంగళూరు మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసినట్లు స్వయంగా అంగీకరించిన ధావన్‌.. ఈమ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయాలని చూస్తున్నాడు. ప్రభసిమ్రాన్ సింగ్ మంచి ఆరంభాలు వస్తున్నా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. శామ్ కరణ్‌ రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో తన సత్తా చాటినా బౌలర్‌గా విఫలం కావడం పంజాబ్‌ను ఆందోళన పరుస్తోంది. 

జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‌వీర్‌ సింగ్‌, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Embed widget