KKR vs SRH IPL Final 2024: ఐపీఎల్ కప్పు కోల్‌కతాదే, సన్‌రైజర్స్ ను చిత్తు చేసిన అయ్యర్ సేన
KR vs SRH IPL Final 2024: ఐపీఎల్17 వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. చెన్నై చెపాక్ స్టేడియం లో జరిగిన తుది సమరంలో విజయ ఢంకా మోగించింది.
KR vs SRH IPL Final 2024 Kolkata Wins Third Ipl Title: ఐపిఎల్ 2024 (IPL) పదిహేడో సీజన్‌లో అయ్యర్ సేన విజయ ఢంకా మోగించింది. చెన్నై వేదికగా జరిగిన తుదిసమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ను చిత్తు చేసింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2012, 2014లో కేకేఆర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గింది. 10 ఏళ్ల తరువాత తాజాగా కేకేఆర్ టీమ్ గంభీర్ మెంటార్ గా ఐపీఎల్ విజేతగా నిలిచింది. చెన్నై, ముంబై 5 ఐపీఎల్ ట్రోఫీల తరువాత లీగ్ లో సక్సెస్ ఫుల్ అయిన మూడో జట్టుగా కేకేఆర్ నిలిచింది.
హైదరాబాద్ అభిమానులకు నిరాశ
ఈ సీజన్ మొత్తానికే రికార్డులు బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో అభిమానులను నిరాశపరిచింది ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. వరుస మ్యాచ్ లలో విధ్వంసకర స్కోర్ తో, మెరుపు బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెట్టిన హైదరాబాద్ బ్యాటర్లు చివరి మ్యాచ్ కి చేతులెత్తేసారు. పోనీ బౌలర్లు అయినా రాణించారా అంటే అదీ లేదు. అతి కష్టం మీద కమిన్స్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు. పరుగులను కట్టడి చేయలేకపోయారు. దీంతో హైదరాబాద్‌జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత్తా(KKR) జట్టు కేవలం 10.3 ఓవర్లలోనే రెండే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నరేన్ రాణించకపోయినా వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు లతో 52 పరుగులు చేశాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి రాణించాడు. మొత్తానికి 8 వికెట్లతో గెలుపొందిన కోల్‌కతా ముచ్చటగా మూడో టైటిల్ తన ఖాతాలో వేసుకుంది.
𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗢𝗙 #𝗧𝗔𝗧𝗔𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 😍🏆
— IndianPremierLeague (@IPL) May 26, 2024
The 𝗞𝗢𝗟𝗞𝗔𝗧𝗔 𝗞𝗡𝗜𝗚𝗛𝗧 𝗥𝗜𝗗𝗘𝗥𝗦! 💜#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/iEfmGOrHVp
హైదరాబాద్ పతనం సాగిందిలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు అది ఎంత చెత్త నిర్ణయమో తెలుసుకొనేలోపే కీలక వికెట్లను కోల్పోయింది. తెలుసుకొని ఆడుదాం అని నిర్ణయించుకొనేలోపే మిడిలార్డర్ పోయింది. మొత్తానికి గట్టిగా ప్లాన్ చేసుకోనే లోపే వికెట్లన్నీ పెవిలియన్ చేరాయి .. ఇంతకంటే హైదరాబాద్ బ్యాటర్ల ఆటగురించి చెప్పుకోవడానికి ఏం మిగలలేదు. గత మ్యాచ్ లలో అదరగొట్టిన ఒక్క బ్యాటర్ కూడా ఈసారి బౌలర్లను బెదరగొట్టడం కాదు కనీసం ఎదురకోలేకపోయారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , రాహుల్ త్రిపాఠి సింగిల్ డిజిట్ స్కోరు చేయగా మార్‌క్రమ్, నితీశ్ రెడ్డి, క్లాసెన్ పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాప్ స్కోర్ పాట్ కమిన్స్ చేసిన 24 పరుగులు మాత్రమే. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లు తియ్యగా , మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలు చెరో రెండు, వైభవ్ అరోరా, నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.