అన్వేషించండి
Advertisement
IPL 2024: కోల్‌కత్తా దూకుడును, పంజాబ్ ఆపగలదా ?
KKR vs PBKS, IPL 2024: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా... తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
KKR vs PBKS IPL 2024 Preview and Predicion : కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR)తో పంజాబ్‌కింగ్స్(PBKS)తో కీలక పోరుకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా... తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా విఫలమవుతున్న మిచెల్ స్టార్క్... ఈ మ్యాచ్‌లో రాణించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కోల్‌కత్తా ప్రస్తుతం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది,
పంజాబ్ గాడిన పడేనా
పంజాబ్ టాపార్డర్ రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో పంజాబ్ కష్టాలు కొనసాగుతున్న వేళ ఈ మ్యాచ్‌లో ధావన్ కీలకంగా మారనున్నాడు. భారత దేశీయ ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు రాణిస్తుండడం పంజాబ్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది. వీరిద్దరూ క్రీజులో నిలబడి పరుగులు సాధిస్తుండడంతో పంజాబ్ బ్యాటింగ్ లోపాలు బహిర్గతం కావడం లేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫామ్ పంజాబ్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. జితేష్ శర్మ కూడా వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌కు తలనొప్పిగా మారింది. టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపికవుతాడని ఆశించిన జితేష్ వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌ను నిరాశ పరుస్తోంది. శామ్ కరణ్... కగిసో రబాడకు ఇతర ఆటగాళ్ల నుంచి మరింత మద్దతు అవసరం. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ వికెట్లు తీసి ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్నారు.
బలంగా కోల్‌కత్తా
కోల్‌కత్తాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ దూకుడుగా ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, రింకూ సింగ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. కోల్‌కత్తాకు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్ మరియు ముజీబ్ ఉర్ రెహమాన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement