అన్వేషించండి

IPL 2023 Auction Live: సెహ్వాగ్‌ మేనల్లుడు సన్‌రైజర్స్‌కు!

IPL 2023 Auction Live: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి! ఆటగాళ్ల వేలంతో సరికొత్త సీజన్‌ సందడి మొదలవుతుంది. కోచి వేదికగా మినీ వేలం జరుగుతోంది.

LIVE

Key Events
IPL 2023 Auction Live: సెహ్వాగ్‌ మేనల్లుడు సన్‌రైజర్స్‌కు!

Background

IPL 2023 Auction Live: 

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి! ఆటగాళ్ల వేలంతో సరికొత్త సీజన్‌ సందడి మొదలవుతుంది. ఈ సారి డిసెంబర్‌ 23న కోచి వేదికగా మినీ వేలం జరుగుతోంది. ఏ ఫ్రాంచైజీలు ఎవరిని కొనుగోలు చేస్తాయి? ఏ క్రికెట్‌ర్‌ ఎక్కువ పలుకుతాడు? ఎవరి కోసం ఎక్కువ పోటీ ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో లైవ్‌ స్ట్రీమింగ్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌, టైమింగ్‌, ఇతర వివరాలు మీకోసం!

వేర్వేరు బ్రాడ్‌కాస్టర్లు

ఈ సారి ఐపీఎల్‌ ప్రసార హక్కులను రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. టీవీ, బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా తీసుకుంది. డిజిటల్‌ లైవ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను వయాకామ్‌18-రిలయన్స్‌ కైవసం చేసుకుంది. జియో యూజర్లు, జియో సినిమా యూజర్లు ఉచితంగానే ఐపీఎల్‌ మిని వేలాన్ని చూడొచ్చు. గతానికి భిన్నంగా 4K క్వాలిటీతో ప్రసారం ఉంటుందని సమాచారం. ఇక టీవీలో స్టార్‌స్పోర్ట్స్‌లో వస్తుంది.

ఐపీఎల్‌ 2023 వేలం లైవ్‌ స్ట్రీమింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ వివరాలు

జియో వినియోగదారులు ఐపీఎల్‌ 2023 లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడొచ్చు. స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ టెలికాస్ట్‌ చేస్తోంది. ప్యాకేజీ ఉన్నవాళ్లు ఆక్షన్‌ను ఆస్వాదించొచ్చు. ఇక లైవ్‌ స్ట్రీమింగ్‌ జియో సినిమాలో ప్రసారం అవుతుంది. జియో టీవీ యాప్స్‌లోనూ వేలాన్ని చూడొచ్చు. డిసెంబర్‌ 23న వేలం  జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరంభం అవుతుంది. వేదిక కోచి.

ఐపీఎల్‌ 2023 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు?

మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 273 మంది భారతీయులు. 132 మంది విదేశీయులు. అందులో నలుగురు అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్నారు. జాతీయ జట్లకు ఆడిన వారు 119, ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని వారు 282, అసోసియేట్‌ దేశాల నుంచి 4 ఉన్నారు. గరిష్ఠంగా 87 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అంఉదలో 30 విదేశీయులకు కేటాయించారు.

కనీస ధర రూ.2 కోట్ల విభాగంలో ఎవరున్నారు?

టామ్‌ బాంటన్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, తైమల్‌ మిల్స్‌, జేమీ ఓవర్టన్‌, క్రెయిన్‌ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, కామెరాన్‌ గ్రీన్‌, ట్రావిస్‌ హెడ్‌, క్రిస్‌ లిన్‌, కేన్‌ విలియమ్సన్‌, ఆడమ్‌ మిల్న్‌, జిమ్మీ నీషమ్‌, రిలే రొసొ, రసి వాన్‌డర్‌ డుసెన్‌, జేసన్‌ హోల్డర్‌, నికోలస్‌ పూరన్‌

పెరగనున్న ప్రైజ్ మనీ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యంత ధనిక బోర్డు. లీగ్‌ విలువ సైతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 ప్రైజ్ మనీ పెంచుతారని వినికిడి. ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం ప్రైజ్ మనీ రూ.46.5 కోట్లు. ఈ ప్రైజ్ మనీ ప్రపంచంలోని ఇతర క్రికెట్ లీగ్‌ల కంటే ఎక్కువ. ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ఇస్తారు. కాగా రన్నరప్‌కు రూ.13 కోట్లు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు లభిస్తాయి. ఈ విధంగా మొత్తం రూ.46.5 కోట్లుగా ఉంది.

19:13 PM (IST)  •  23 Dec 2022

సెహ్వాగ్‌ మేనల్లుడు సన్‌రైజర్స్‌కు!

అమిత్‌ మిశ్రాను రూ.50 లక్షల కనీస ధరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌ అల్లుడు మయాంక్‌ డాగర్‌ను సన్‌రైజర్స్‌ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. సౌరాష్ట్ర ఆల్‌రౌండర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.20 లక్షలకు తీసుకుంది.

18:07 PM (IST)  •  23 Dec 2022

కైల్ జేమీసన్‌ను చెన్నై కొనుగోలు చేసింది.

కైల్ జేమీసన్ బేస్ ప్రైజ్ రూ.కోటి. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.

18:06 PM (IST)  •  23 Dec 2022

ఆకట్టుకోని సందీప్ శర్మ

సందీప్ శర్మ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అయినా అమ్ముడుపోకుండా ఉండిపోయాడు

18:03 PM (IST)  •  23 Dec 2022

రిలే మెరెడిత్ అన్ సేల్డ్

రిలే మెరెడిత్ బేస్ ప్రైస్ రూ.1.50 కోట్లు. అయినా అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.

18:03 PM (IST)  •  23 Dec 2022

దాసున్ షనకాను పట్టించుకోని ఫ్రాంఛైజీలు 

శ్రీలంక ఆటగాడు దాసున్ షనకా బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు.  అమ్ముడుపోకుండా ఉండిపోయాయి.

18:02 PM (IST)  •  23 Dec 2022

అమ్ముడుపోని మహ్మద్ నబీ

అఫ్ఘానిస్తాన్ అత్యుత్తమ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ అమ్ముడుపోలేదు.

18:01 PM (IST)  •  23 Dec 2022

అమ్ముడుపోని డారిల్ మిచెల్

 డారిల్ మిచెల్ బేస్ ప్రైస్ రూ.కోటి. అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

18:01 PM (IST)  •  23 Dec 2022

డేనియల్ సామ్స్ ను కొనుగోలు చేసిన లక్నో

డేనియల్ సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. 

18:00 PM (IST)  •  23 Dec 2022

రొమారియోను లక్నో కొనుగోలు చేసింది

రొమారియో షెపర్డ్ ప్రాథమిక ధర రూ .50 లక్షలు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.

17:59 PM (IST)  •  23 Dec 2022

అమ్ముడుపోని మన్దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, డేవిడ్ మలన్ 

మన్దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, డేవిడ్ మలన్ అమ్ముడుపోలేదు

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget