By: ABP Desam | Updated at : 11 Feb 2022 06:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐపీఎల్ వేలం
IPL Auction 2022 Remaining Purse: ఐపీఎల్ పదిహేనో సీజన్ వేలానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బెంగళూరుకు అందరూ చేరుకున్నారు. ఇంతకు ముందే ఆయా జట్ల ప్రతినిధులు క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. 10 ఫ్రాంచైజీలు, 600 ఆటగాళ్లు వేలం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 217 మందిని ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి వద్ద ఎంత మంది క్రికెటర్లు ఉన్నారు? పర్సులో డబ్బులెన్ని ఉన్నాయో? చూసేద్దాం!
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వారివద్ద ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. ఇప్పుడున్న డబ్బులతో 7 విదేశీయులు, 22 స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలి.
దిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.47.50 కోట్లు ఉన్నాయి. వీరు రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నార్జ్‌ను రీటెయిన్ చేసుకున్నారు. తమవద్ద ఉన్న డబ్బుతో 22 స్వదేశీ, 7 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయాలి.
గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.52 కోట్లు ఉన్నాయి. ఈ కొత్త జట్టు హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్‌ను డ్రాఫ్ట్ చేసింది. ఇప్పుడున్న డబ్బుతో 7 విదేశీ, 23 స్వదేశీ క్రికెటర్లను తీసుకోవాలి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. వీరు ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీయులను రీటెయిన్ చేసుకున్నారు. వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను అట్టిపెట్టుకున్నారు. 23 స్వదేశీ, 6 విదేశీ ఆటగాళ్లు అవసరం.
లక్నో సూపర్‌జెయింట్స్ వద్ద రూ.59 కోట్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, రవి బిష్ణోయ్‌ను డ్రాఫ్ట్ చేశారు. వీరికీ గుజరాత్ టైటాన్స్ మాదిరిగానే ఆటగాళ్లు అవసరం.
లీగులోనే అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాను రీటెయిన్ చేసుకుంది. 23 స్వదేశీ, 6 విదేశీ ఆటగాళ్లు కావాలి.
పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.72 కోట్లున్నాయి. కేవలం మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్‌ను అట్టిపెట్టుకున్నారు. వీరికి 23 స్వదేశీ, 8 విదేశీ ఆటగాళ్లు కావాలి. వేలంలో ఏదైనా చేసే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.62 కోట్లు ఉన్నాయి. వీరు సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్‌ను రీటెయిన్ చేసుకున్నారు. మరో 23 స్వదేశీ, 7 విదేశీ ఆటగాళ్లను తీసుకుంటారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.57 కోట్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకున్నారు. 23 స్వదేశీ, 7 విదేశీ ఆటగాళ్లు కావాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.68 కోట్లు ఉన్నాయి. వీరు కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను రీటెయిన్ చేసుకున్నారు. పూర్తి జట్టును నిర్మించుకోవాల్సి ఉంది. వీరికి 23 స్వదేశీ, 7 విదేశీ ఆటగాళ్లు అవసరం.
IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో