అన్వేషించండి

IPL 2026 RCB vs SRH: ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !

IPL 2026 RCB vs SRH: ఐపీఎల్ 19వ సీజన్‌లోని తొలి మ్యాచ్ RCB, SRH జట్ల మధ్య జరగనుంది. ముఖాముఖీ పోరుతో సన్‌రైజర్స్ ఎక్కువ విజయాలు సాధించగా, ఆర్సీబీని సైతం తక్కువగా అంచనా వేయలేం.

బెంగళూరు: ఐపీఎల్ 2026 కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. క్రికెెట్ ప్రేమికులు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  మార్చి 28 శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచుతో ఐపీఎల్ 19వ సీజన్ షురూ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సొంత స్టేడియంలో తలపడుతుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒత్తిడి ఉంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించే అవకాశం ఉంటుందో తెలుసా..

కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న హైదరాబాద్

రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌తో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఆడనుంది. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌కు ఆర్సీబీతో మ్యాచ్ విజయం అంత సులువు కాదు. మరోవైపు, ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్‌తో బరిలోకి దిగనుంది.

RCB vs SRH ముఖామూఖీలో పైచేయి ఎవరిది 

ఆర్సీబీ, SRH మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. క ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో గెలవగా.. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. హెడ్ టు హెడ్‌లో హైదరాబాద్‌ 2 మ్యాచ్‌లు ఎక్కువ నెగ్గి పైచేయి సాధించింది.  అయితే ఈరోజు మ్యాచ్‌ బెంగళూరు వేదికగా జరుగుతుంది కనుక ఆతిథ్య ఆర్సీబీకి ఎడ్జ్ లభిస్తుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగడం వీరికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం ?

భారత కాలమానం ప్రకారం, ఆర్సీబీ, హైదరాబాద్ మధ్య జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక టాస్గం 7 గంటలకు వేయనున్నారు. గత ఏడాది విక్టరీ సమావేశం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడంతో వారికి నివాళిగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించడం లేదు.

ఆర్సీబీ స్క్వాడ్

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్త్వాల్, అభినందన్ సింగ్, జాకబ్ బెథెల్, జోర్డాన్ కాక్స్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్, సాత్విక్ దేశ్వాల్.

హైదరాబాద్ స్క్వాడ్

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఇషాన్ మలింగ, శివమ్ మావి, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ, బ్రైడన్ కార్స్, సలిల్ అరోరా, కమిందు మెండిస్, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రేన్స్ ఫులేత్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మాలే, శివాంగ్ కుమార్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget