అన్వేషించండి

Tragedy In IPL 2026: ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!

ఐపీఎల్ 2026 బ్రాడ్‌కాస్ట్ ఆపరేషన్స్‌లో కీలక సభ్యుడైన 76 ఏళ్ల బ్రిటిష్ ఇంజనీర్ ఇయాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ ముంబైలోని ఒక హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడి మరణించారు.

IPL 2026 Latest Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ కొనసాగుతుండగా బ్రాడ్‌కాస్ట్ బృందంలో తీవ్ర విషాదం నెలకొంది. బీసీసీఐతో కలిసి పని చేస్తున్న 76 ఏళ్ల బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఇయాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ మంగళవారం ముంబైలో మరణించారు. దక్షిణ ముంబైలోని ఒక ప్రముఖ హోటల్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని హోటల్ యాజమాన్యం గుర్తించింది. వెంటనే ఆయనను బాంబే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషాద వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నివాళి
"మా బ్రాడ్‌కాస్ట్ ఆపరేషన్స్‌లో అంతర్భాగంగా ఉంటూ ఎంతో నిబద్ధతతో పనిచేసిన ఇయాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ అకాల మరణం మా అందరినీ కలచివేసింది. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు మా అండదండలు ఉంటాయి. లాంగ్‌ఫోర్డ్ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఐపీఎల్ కట్టుబడి ఉంది. ఐపీఎల్ నిర్వహణలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు" అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

అసలేం జరిగింది?
పోలీసుల సమాచారం ప్రకారం.. లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుండి ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో స్టే చేస్తున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తన గదికి చేరుకున్నారు. సోమవారం ఉదయం హోటల్ రిసెప్షనిస్ట్ ఆయన గదికి ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది వద్దకు వెళ్లి డోర్ కొట్టినా లోపల నుండి సమాధానం లేకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచారు. అప్పటికే లాంగ్‌ఫోర్డ్ నేలపై పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది హోటల్ ఇన్-హౌస్ డాక్టరుకు సమాచారం అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్లు తెలిసింది.

పోలీసు దర్యాప్తు
మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని ప్రాథమికంగా తెలిసింది. ప్రస్తుతం దీనిని అసహజ మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. లాంగ్‌ఫోర్డ్ ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార విభాగానికి సాంకేతిక సహకారం అందించడానికి ముంబై వచ్చారు. సుదీర్ఘ కాలంగా బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ రంగంలో అనుభవం ఉన్న ఆయన మృతి పట్ల క్రికెట్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget