IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో మొత్తం 77 స్లాట్స్, ఏ జట్టు ఎంత మందిని తీసుకునే వీలుందో లిస్ట్ చూశారా
IPL 2026 Auction Update: ఐపీఎల్ 2026 వేలం తేదీ ఖరారైంది. విదేశీ ఆటగాళ్ల కోసం 27 స్లాట్లు ఖాళీగా ఉండగా, మొత్తం 77 స్లాట్స్ ఉన్నాయి. జట్ల మొత్తం పర్స్ వివరాలు చూడండి.

IPL 2026 Auction: ఆండ్రీ రస్సెల్, డేవిడ్ మిల్లర్, జోష్ ఇంగ్లిస్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే,గ్లెన్ మాక్స్ వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, వనిందు హసరంగ వంటి విదేశీ ఆటగాళ్ళు ఈసారి IPL వేలంలోకి వచ్చారు. దాంతో వేలంలో వారికి మంచి డిమాండ్ వస్తుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. స్టార్ ప్లేయర్లను పలు కారణాలతో వారి జట్లు వేలంలోకి విడుదల చేశాయి. అయితే వేలంలో విదేశీ ఆటగాళ్లకు 27 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, మొత్తం స్లాట్‌ల సంఖ్య 78. వేలం గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఈసారి IPL వేలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది మినీ వేలం. IPLలో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ప్రతి జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవచ్చు. IPL వేలం, జట్లకు సంబంధించిన నియమాలు, మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
IPL జట్టులో ఎంత మంది ఆటగాళ్ళు ఉండవచ్చు?
ఒక జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను ఒక ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
IPL జట్టులో గరిష్టంగా ఎంత మంది విదేశీ ఆటగాళ్ళు ఉండవచ్చు?
ఒక IPL జట్టు గరిష్టంగా 8 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలోకి చేర్చుకోవచ్చు.
IPL 2026 వేలంలో ఎన్ని స్లాట్‌లకు బిడ్ వేస్తారు ?
IPL వేలంలో పాల్గొనే ఆటగాళ్లను కొన్ని రోజుల తర్వాత షార్ట్‌లిస్ట్ చేస్తారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి స్లాట్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 జట్లన్నింటినీ కలిపి ఇన్ని స్లాట్‌లే ఖాళీగా ఉన్నాయి. KKRలో అత్యధిక స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి, కేకేఆర్ 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. పంజాబ్ కింగ్స్‌లో అత్యల్ప స్లాట్‌లు ఉన్నాయి, వారు 21 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నారు. కనుక వేలంలో మరో నలుగురు వరకు తీసుకోవచ్చు.
విదేశీ ఆటగాళ్లకు ఎన్ని స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి?
IPL 2026 వేలంలో అన్ని జట్లకు కలిపి మొత్తం 27 మంది విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి జట్టు యొక్క మొత్తం స్లాట్‌లు, అందులోని విదేశీ ఆటగాళ్ల ఖాళీ స్లాట్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
అన్ని జట్ల మొత్తం, ఓవర్సీస్ స్లాట్‌ల సంఖ్య
- చెన్నై సూపర్ కింగ్స్: 9 స్లాట్స్ (4 ఓవర్సీస్)
- ముంబై ఇండియన్స్: 5 స్లాట్స్ (1 ఓవర్సీస్)
- కోల్‌కతా నైట్ రైడర్స్: 13 స్లాట్స్ (6 ఓవర్సీస్)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 8 స్లాట్స్ (2 ఓవర్సీస్)
- సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 స్లాట్స్ (2 ఓవర్సీస్)
- గుజరాత్ టైటాన్స్: 5 స్లాట్స్ (ఓవర్సీస్)
- రాజస్థాన్ రాయల్స్: 9 స్లాట్స్ (1 ఓవర్సీస్)
- లక్నో సూపర్ జెయింట్స్: 6 స్లాట్స్ (4 ఓవర్సీస్)
- ఢిల్లీ క్యాపిటల్స్: 8 స్లాట్స్ (5 ఓవర్సీస్)
- పంజాబ్ కింగ్స్: 4 స్లాట్స్ (2 ఓవర్సీస్)
అన్ని జట్ల పర్స్ బ్యాలెన్స్
- KKR- 64.3 కోట్ల రూపాయలు
- CSK- 43.4 కోట్ల రూపాయలు
- SRH- 25.5 కోట్ల రూపాయలు
- LSG- 22.95 కోట్ల రూపాయలు
- DC- 21.8 కోట్ల రూపాయలు
- RCB- 16.4 కోట్ల రూపాయలు
- RR- 16.05 కోట్ల రూపాయలు
- GT- 12.9 కోట్ల రూపాయలు
- PBKS- 11.5 కోట్ల రూపాయలు
- MI- 2.75 కోట్ల రూపాయలు
అన్ని జట్ల వద్ద ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్‌ను కలిపితే 10 జట్ల వద్ద 237 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిని జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వినియోగిస్తాయి. KKR వద్ద ఎక్కువ నగదు ఉంది. ముంబై ఇండియన్స్ తక్కువ నగదుతో వేలంలో పాల్గొంటుంది.
IPL 2026 వేలం ఎప్పుడు జరుగుతుంది?
IPL 2026 కోసం వేలం డిసెంబర్ 16, 2025న జరుగుతుందని BCCI అధికారికంగా తెలిపింది.
IPL 2026 వేలం ఎక్కడ జరుగుతుంది?
IPL 2026 కోసం వేలం అబుదాబిలో నిర్వహించనున్నారు.





















