అన్వేషించండి

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వీరే !

IPL 2025 Mega Auction | ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ రానుంది. అత్యధిక ధరలకు ఫ్రాంచైజీలు వీరిని దక్కించుకునే ఛాన్స్ ఉంది.

IPL Auction 2025 | హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం (IPL Auction 2025) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నామని బీసీసీఐ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా.. వరుసగా రెండో సంవత్సరం మెగా ఆక్షన్ ను విదేశాలలో జరగనుంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్ కత్తా ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ను వేలంలోకి వదిలేసింది. మరికొందరు కీలక ఆటగాళ్లు సైతం మెగా ఆక్షన్ లోకి రావడంతో ఈ సీజన్ వేలంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ ఏడాది 1,574 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 1,165 మంది భారత ఆటగాళ్లు ఉండగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. క్యాప్డ్ ప్లేయర్స్ 320, అన్ క్యాప్డ్ ప్లేయర్లు 1,224 మంది, మరో 30 మంది అసోసియేట్ దేశాల (టెస్ట్ క్రికెట్ ఆడని దేశాల) ఆటగాళ్లు ఉన్నారు.    ఒక్కో ఫ్రాంచైజీ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మంది ఆటగాళ్ల వరకు తీసుకోవచ్చు. అంటే ఓవరాల్ ఐపీఎల్ లో 250 మంది వరకు ప్లేయర్లు ఆడే ఛాన్స్ ఉంది. కానీ 46 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోగా, ఈ వేలంలో 204 మంది ఆటగాళ్ల వరకు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కొందరు కీలక ఆటగాళ్లపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తాయి. 

మహ్మద్ షమీ ఛాంపియన్ బౌలర్, అయినప్పటికీ ఫిట్‌నెస్ సమస్య కారణంగా గుజరాత్ టైటాన్స్ అతడ్ని వేలంలోకి రిలీజ్ చేసింది. ఒకవేళ షమీ కోలుకుంటాడని సంకేతాలు వస్తే మాత్రం వేలంలో షమీకి మంచి ధర వస్తుంది. 

IPL 2025 వేలంలో అత్యంత ఖరీదైన బిడ్ లలో రిషబ్ పంత్ ఒకటిగా నిలవనున్నాడు. పలు ఫ్రాంచైజీలు పంత్‌ను దక్కించుకునేందుకు భారీగా వేలం వేస్తాయని అంతా భావిస్తున్నారు. వేలంలో పంత్ రూ. 20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉందని, డాషింగ్ బ్యాట్ పై అంచనాలు నెలకొన్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ని రిలీజ్ చేసింది. లాస్ట్ ఐపీఎల్ చివర్లో లక్నో ఓనర్ అందరి ముందే రాహుల్ పై తీవ్రంగా విరుచుకుపడటాన్ని క్రికెట్ ప్రేమికులు మరిచిపోరు. మంచి బ్యాటర్, స్ట్రోక్ ప్లేయర్ అయినా నిలకడలేమి, స్రైక్ రేట్ రాహుల్ కు సమస్యగా మారింది. వేలంలో రాహుల్ కోసం పోటీ ఉండనుంది.

ముంబై ఇండియన్స్ వదిలేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు సైతం వేలంలో మంచి ధర వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. టీ20 క్రికెట్ లో డైనమైట్ ఇన్నింగ్స్ లు ఆడే సత్తా కిషన్ సొంతం. కీపర్ బ్యాటర్ కు డిమాండ్ రావడం కన్ఫామ్. 

Also Read: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

IPL 2025 వేలంలో బౌలర్లకు సైతం మంచి ధర పెడుతున్నాయి ఫ్రాంచైజీలు. ముఖ్యంగా భారత్ గడ్డపై ఐపీఎల్ అంటే స్పిన్నర్లకు డిమాండ్ వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కు ఎన్నో విజయాలు అందించిన యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేయడానికి పలు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ విజయం సాధించింది. కొత్త నాయకుడి కోసం వెతుకుతున్న బృందాలు అతనిని బోర్డులోకి తీసుకురావడానికి రూ. 20 కోట్లను అధిగమించే బలమైన వేలంపాటలు వేయాలని భావిస్తున్నారు.

ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయడం షాకింగ్ విషయం. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే బట్లర్ సైతం మంచి ధర పలకనున్నాడు. ఓపెనర్ గా టాపార్డర్ లో విలువైన పరుగులు చేసే సత్తా ఉంది. రచిన్ రవీంద్రను చెన్నై రిలీజ్ చేసింది. దాంతో ఈ మెగా వేలంలో న్యూజిలాండ్ బ్యాటర్ కు భారీ డిమాండ్ తో బిగ్ బిడ్డింగ్ సొంతం చేసుకోనున్నాడు. 

లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ టీమిండియాకు ఆడుతున్నాడు. మంచి స్పెల్ తో మ్యాచ్ మలుపుతిప్పగలడు. కానీ పంజాబ్ కింగ్స్ అర్షదీప్ ను రిటెయిన్ చేయలేదు. బుమ్రా తర్వాత భారత కీలక బౌలర్లలో ఒకరిగా ఉన్న అర్ష్‌దీప్ డెత్ ఓవర్లతో పాటు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయగలడు. ఈ పేసర్ కు సైతం డిమాండ్ వచ్చి భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Best Selling Bike: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే - నంబర్ వన్ స్థానానికి చేరిన హీరో!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే - నంబర్ వన్ స్థానానికి చేరిన హీరో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Best Selling Bike: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే - నంబర్ వన్ స్థానానికి చేరిన హీరో!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే - నంబర్ వన్ స్థానానికి చేరిన హీరో!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
BSNL Best Long Term Plans: ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ - 790 జీబీ అందించే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ - ధర ఎంతంటే?
ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ - 790 జీబీ అందించే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ - ధర ఎంతంటే?
Embed widget