RCB vs PBKS: ఫైనల్‌కు ఆర్సీబీకి భారీ షాక్.. గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ బ్యాటర్
RCB vs PBKS Final | తొలి ఐపీఎల్ ట్రోఫీ అందుకోవాలని భావిస్తున్న ఆర్సీబీకి ఫైనల్ ముందే ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఫైనల్లో ఆడతాడా లేదా అనేది తేలలేదు.

RCB vs PBKS Final: నేడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టైటిల్ పోరుకు ముందు తొలి ట్రోఫీ కోసం చూస్తున్న RCB కి పెద్ద షాక్ తగిలింది. RCB లోని ప్లేయర్ గాయపడ్డాడు. ఈ కీలక మ్యాచ్ లో ఆడతారా లేదా అనేది సస్పెన్స్ లో ఉంది. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడలేదు. కానీ కీలకమైన ఫైనల్ లో ఆడకపోతే RCBకి నష్టం జరిగే అవకాశం ఉంది. హార్ట్ హిట్టర్ అయిన టిమ్ డేవిడ్ మిడిలార్డర్‌లో కీలకంగా మారే బ్యాటర్.
కెప్టెన్ పాటిదార్ ఏమన్నాడు..
మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో RCB కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుత.. టిమ్ డేవిడ్ ఫైనల్ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. “ఇంకా టిమ్ డేవిడ్ కోలుకున్నాడో లేదో స్పష్టమైన సమాచారం రాలేదు. మా మెడికల్ టీం, డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సాయంత్రం వరకు అతని ఫిట్‌నెస్ గురించి సమాచారం వస్తుంది. అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటాం” అని అన్నాడు.
టిమ్ డేవిడ్ మంచి స్ట్రైక్ రైట్ తో ఆడుతున్నాడు. ఈ సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 187 పరుగులు చేసినా.. అతని స్ట్రైక్ రేట్ 185.14. ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ఈ ఫామ్ లో ఉన్న బ్యాటర్ ఫైనల్ మ్యాచ్ లో ఆడకపోవడం RCB కి కచ్చితంగా మైనస్ కానుంది. అయితే ప్రతి జట్టులోనూ అతడ్ని రీప్లేస్ ఆటగాడితో మెరుగైన ఫలితాల కోసం టీమ్ ప్లానింగ్ చేస్తుంది. టిమ్ డేవిడ్ స్థానంలో లియాం లివింగ్‌స్టోన్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో విఫలమవుతున్నాడు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 అంచనా ఇదే..
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI అంచనా : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లీష్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, విజయ్ కుమార్ వైశక్, కైల్ జేమిసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/హర్‌ప్రీత్ బ్రార్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI అంచనా : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), మయంక్ అగర్వాల్, లియాం లివింగ్‌స్టన్/ టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్‌వుడ్, సుయాష్ శర్మ





















