అన్వేషించండి

IPL 2024: కొత్త రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ, ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి ఆటగాడు

Virat Kohli: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 10 సీజన్లలో 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

IPL 2024 SRH vs RCB Virat Kohli Ceated New Record In Ipl History:  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.  2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.

ఈ మ్యాచ్ లో . ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్సుతో కోహ్లి 251 సిక్సుల మైల్‌స్టోన్ అందుకున్నాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. లిస్టులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్‌తో సమానం ఉన్నాడు. మొత్తంగా 246 మ్యాచ్‌లలో 251 సిక్సర్లు బాదాడు. డివిలియర్స్‌ ఇప్పటివరకు 184 మ్యాచ్‌లలో 251 సిక్సులు కొట్టాడు. 

అదరగొట్టిన ఆర్సీబీ

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ బ్యాటర్ లు తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. . సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్‌లు, 1 సిక్స్‌ ఉన్నాయి. రజత్‌ పటిదార్‌ కేవలం 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కామెరూన్‌ గ్రీన్‌ బెంగళూరుకు ఆపద్భాందవుడిగా మారాడు. గ్రీన్‌ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.  చివర్లో స్వప్నిల్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చొన్న గ్రీన్‌ కారణంగానే  బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 

207 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే ట్రానిస్‌ హెడ్‌ వెనుదిరగడంతో హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఒక్క పరుగే చేసిన హెడ్‌...జాక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మా‌ర్‌క్రమ్‌ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి 13, క్లాసెన్‌ ఏడు, పరుగులకు వెనుదిరగడంతో 56 పరుగులకే హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ శర్మ కాసేపు బెంగళూరు బౌలర్లను అడ్డుకున్నాడు. 13 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి అవుటయ్యాడు. పాట్‌ కమిన్స్‌ కూడా 31 పరుగులే చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో  హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.  6 వరుస ఓటముల తర్వాత బెంగళూరు విక్టరీని నమోదు చేసింది. రజత్ పాటిదార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget