RR vs MI: ముంబై, రాజస్థాన్ మ్యాచ్ - రికార్డులు ఏం చెప్తున్నాయంటే ?
IPL 2024: ఐపిఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మొత్తం 29 సార్లు తలపడ్డాయి. ఈ 29 మ్యాచ్‌ల్లో ముంబై 15 సార్లు గెలిచింది. రాజస్థాన్ 13 విజయాలు సాధించింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు.
IPL 2024 RR vs MI Head to head records : ఐపీఎల్‌లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ముంబై... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌పై పోరుకు సిద్ధమైంది. కెప్టెన్‌గా పర్వాలేదనిపిస్తున్నా ఆటగాడిగా పాండ్యా విఫలమవుతండడం ముంబైను ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్... హార్దిక్‌కు చాలా కీలకంగా మారనుంది.
ముంబై-రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మొత్తం 29 సార్లు తలపడ్డాయి. ఈ 29 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ 15 సార్లు గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 13 విజయాలు సాధించింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు.
పిచ్ రిపోర్ట్
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పిచ్ బౌలింగ్ అనుకూలిస్తూ ఉంటుంది. 200 కంటే ఎక్కువ స్కోరు చేస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. IPL 2024 సీజన్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో అత్యల్ప మొదటి ఇన్నింగ్స్ టోటల్ 183. అయినా ఇతర పిచ్‌లతో పోలిస్తే తక్కువ స్కోరు నమోదవుతుంది.
గత మ్యాచ్‌లో ఇలా
ముంబయి(MI)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్(RR) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబయి టీం కి ఓటమి పరంపర కొనసాగినట్టైంది. 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో రియాన్ పరాగ్ మెరుపులు కురిపించాడు. రాజస్థాన్‌కిది మూడవ విజయం కాగా.. ముంబయికి వరుసగా ఇది మూడో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
రాజస్థాన్(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడమే గగనమైంది. తొలి ఓవర్‌లో మొదలైన ముంబై కష్టాలు చివరి ఓవర్ వరకూ కొనసాగాయి.
జట్లు
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.