అన్వేషించండి

IPL 2024: ముంబై విధ్వంసానికి, ధోనీ వ్యూహాలకు మధ్య పోరు

MI vs CSK: అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో... చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌లో మొదటిసారి ధోనీ... కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు.

IPL 2024 MI vs CSK Preview and Prediction : ఈ ఐపీఎల్‌(IPL)లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI)తో... డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) తలపడనుంది. మిస్టర్‌ కూల్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్న వేళ వాంఖడేలో మహీ చివరి మ్యాచ్‌ను ఆడనున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌లో మొదటిసారి ధోనీ(Dhoni)... కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. 42 ఏళ్ల వయసులో కీపింగ్‌లో అదరగొడుతున్న ధోనీ... బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ధోనీపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు అసలు మజాను పంచనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. 
 
చూపంతా ధోనీపైనే... 
ముంబైతో జరిగే మ్యాచ్‌లో క్రికెట్‌ ప్రేమికుల చూపంతా మహేంద్రసింగ్‌ ధోనిపైనే ఉంది. తన వ్యూహాలతో మరోసారి ముంబైకి చెక్‌ పెట్టేందుకు ధోని సిద్ధంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో రెండు పరాజయాలను చవిచూసిన చెన్నై... ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఓ సారూప్యత అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతలు స్వీకరించగా... ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌, రహానే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్‌ చాలా దుర్భేద్యంగా ఉంది. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, జడేజా, రచిన్‌ రవీంద్రలతో బౌలింగ్‌ కూడా పర్వాలేదనిపిస్తోంది. దీనికి అదనంగా ధోనీ వ్యూహాలు ఉండనే ఉన్నాయి. వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 220కు పరుగులు సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది. 
 
ఆత్మ విశ్వాసంతో ముంబై 
ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి గాడినపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చిన తర్వాత ముంబై బ్యాటింగ్‌ చాలా బలంగా మారింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసమే సృష్టించాడు. కేవలం 17 బంతుల్లో అర్ధశతకం చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇప్పుడు చెన్నైపై సూర్య ఎలా ఆడతాడో వేచి చూడాలి. వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్లను చెన్నై బౌలర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇషాన్ కిషన్ 161 పరుగులు, రోహిత్ విధ్వంసం, పాండ్యా లతో ముంబై బ్యాటింగ్‌ కూడా బలంగానే ఉంది. కానీ ముంబై జట్టు బౌలింగ్ భారాన్ని పేస్‌ స్టార్‌ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసి తాను ఎంత ప్రమాదకర బౌలర్‌నో మరోసారి బుమ్రా చాటిచెప్పాడు. బుమ్రా యార్కర్లను, లైన్ అండ్‌ లెంగ్త్‌ను చెన్నై బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 
 
జట్లు:
ముంబై ఇండియన్స్:  హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 
 
చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WPL Winner Mumbai Indians: హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WPL Winner Mumbai Indians: హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌల‌ర్లు.. రెండోసారి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కైవ‌సం.. 8 ర‌న్స్ తో ఢిల్లీ చిత్తు
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
DMK Comments On Pawan Statement: పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Embed widget