అన్వేషించండి

IPL 2024: లక్నోపై కోల్కతా భారీ విజయం, పాయింట్ల పట్టికలో టాప్ లేపిన కేకేఆర్

IPL 2024, LSG vs KKR: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. లక్నోపై 98 పరుగుల తేడాతో మాజీ ఛాంపియన్ కేకేఆర్ గెలుపొందింది.

IPL 2024  LSG vs KKR Kolkata Knight Riders won by 98 runs: లక్నో(LSG) పై కోల్‌కతా(KKR) 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో  అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన లక్నో రెండవ ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది. అక్కడి నుంచి వరుసగా  ఒక్కో ఓవర్ లో ఒక్కో బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరారు. 137 పరుగుల వద్ద లఖ్‌నవూ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. దీంతో లక్నోతో జరిగిన  మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. వరుణ్ చక్రవర్తి  3, హర్షిత్ రాణా 3, రస్సెల్2 వికెట్లు తీసి లక్నో   పతనాన్ని శాసించారు. స్టార్క్‌, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.

కోల్‌కత్తా ఇన్నింగ్స్ 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  లక్నో... కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కత్తా ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌... సునీల్‌ నరైన్‌ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఫిల్‌ సాల్ట్‌ కేవలం 14 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేసి సాల్ట్‌ అవుటయ్యాడు.   27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత   రెచ్చిపోయిన సునీల్ నరైన్  స్టాయినిస్ వేసిన 11వ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్స్‌లు బాదాడు. అయితే సరిగ్గా 140 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 81 పరుగులు చేసిన నరైన్.. రవి బిష్ణోయ్ వేసిన 12 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

తరువాత రఘువంశీ ధాటీ గా ఆడుతుండగా కోల్‌కతా 167 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నవీనుల్‌ హక్ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదిన ఆండ్రీ రస్సెల్ తర్వాతి బంతికే కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తరువాత కోల్‌కతా 171 పరుగుల రఘువంశీ అవుట్ అయ్యాడు. యుధ్విర్‌ సింగ్ వేసిన 15.1 ఓవర్‌లో వికెట్ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నవీనుల్ హక్ వేసిన 18 ఓవర్‌లో ఐదో బంతికి బౌండరీ కొట్టిన రింకు సింగ్కూ డా బౌండరీ బాది చివరి బంతికి, 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

శ్రేయస్ అయ్యర్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లతో 23 పరుగులు చేయగా....రమణ్‌దీప్‌ సింగ్‌ ఆరు బంతుల్లోనే ఒక ఫోరు, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్‌ హక్‌ మూడు వికెట్లు తీశాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Advertisement

వీడియోలు

ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
5 seater Cheapest car: 5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
Vanara Movie Teaser : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
Embed widget