![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2024 : లక్నోకు గట్టి ఎదురుదెబ్బ, స్పీడ్ స్టార్ దూరం
LSG Fast Bowler Mayank Yadav: ఐపీఎల్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన చేసిన మాయంక్ యాదవ్ అనారోగ్యం కారణంగా మరో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు
![IPL 2024 : లక్నోకు గట్టి ఎదురుదెబ్బ, స్పీడ్ స్టార్ దూరం IPL 2024 LSG Fast Bowler Mayank Yadav Unlikely To Play Upcoming Matches IPL 2024 : లక్నోకు గట్టి ఎదురుదెబ్బ, స్పీడ్ స్టార్ దూరం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/9db46628b2c6b3188d558ee1dbcff9ed1712896497710872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LSG Fast Bowler Mayank Yadav Unlikely To Play Upcoming Matches : ఈ ఐపీఎల్(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన చేసిన మాయంక్ యాదవ్(Mayank Yadav).. గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
150కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు సంధిస్తూ లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న లక్నో స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదు. నేడు ఢిల్లీతో క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు కోల్‌కతాతో జరిగే తర్వాతి మ్యాచ్‌కూ మయాంక్ అందుబాటులో ఉండడు. ఈ నెల 19న చెన్నైతో మ్యాచ్ సమయానికి మయాంక్ కోలకుంటాడని భావిస్తున్నట్లు లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(LSG) యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. గత మ్యాచ్ లోనే వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇంకా ఆ రికార్డ్ను క్రికెట్ అభిమానులు మరచవపోఎలోపే మరో రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా మూడుసార్లు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డుకెక్కాడు. మయాంక్ కేవలం 2 మ్యాచుల్లో 50 కంటే తక్కువ బంతులే వేసి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం. అంటే తన గత రికార్డును తను ఆడిన రెండో మ్యాచ్ లోనే బద్దలు కొట్టాడు.
స్పీడ్ స్టార్ మయాంక్
ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల పేసర్ మయాంక్ యాదవ్. దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ అతడు గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. నిన్నటి మ్యాచ్ కి మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ యాదవ్‌కు చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ తన మొదటి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి, కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఇక ఇప్పుడు 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు.
Also Read: గత రికార్డులన్నీ లక్నోవైపే, ఢిల్లీ గెలిస్తే కొత్త చరిత్రే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)