అన్వేషించండి

IPL 2024: అగ్ర జట్ల మధ్య అసలు పోరు, టాప్‌ లేపేదెవరో ?

KKR vs RR: ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్... రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో పోటీ పడనున్నాయి.

IPL 2024 KKR vs RR Preview and Prediction : ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య కీలక పోరు నేడు జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్(RR)... రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని ఒకరు... టాప్‌కు చేరుకోవాలని మరొకరు వ్యూహాలు రచిస్తున్నారు. 

నరైన్‌ను ఎదుర్కోగలరా..?
ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ నుంచి రాజస్థాన్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో నరైన్‌కు మంచి రికార్డు ఉంది. తన స్పిన్‌ మాయాజాలంతో నరైన్ ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరోసారి ఆలాంటి ప్రదర్శనే  చేయాలని నరైన్‌ చూస్తుండగా... నరైన్‌ను ఎదుర్కొనేందుకు రాజస్థాన్ పక్కా ప్రణాళిక రచిస్తోంది. రాజస్థాన్‌పై విజయం సాధిస్తే కోల్‌కత్తా అగ్రస్థానానికి చేరుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచుల్లో నరైన్‌ ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ సేనను కేవలం 161 పరుగులకు కట్టడి చేయడంలో నరైన్‌ కీలకపాత్ర పోషించాడు. సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్  ఈ సీజన్‌లో 155 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వీరు నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కోల్‌కత్తాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేలవమైన ఫామ్ ఆందోళన పరుస్తోంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌ 38 పరుగులతో నాటౌట్‌గా ఉన్నా అప్పటికి అతడిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ ఎలా రాణిస్తాడో చూడాలి.

రాజస్థాన్‌ జోరు కొనసాగేనా..
సంజు శాంసన్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్‌లతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. ఈ సీజన్‌లో 183.51 స్ట్రైక్-రేట్‌తో 33 సగటుతో ఉన్న నరైన్ ధాటిగా ఆడుతున్నాడు. మిగిలిన బ్యాటర్లు కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, కేశవ్ మహారాజ్‌లలో బలీయమైన బౌలింగ్ లైనప్ ఉంది. రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌కి ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి. 

జట్లు: 
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget