SRH vs KKR Preview: ఆరెంజ్ ఆర్మీకి చావోరేవో! గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవం!
SRH vs KKR Preview: ఐపీఎల్ 2023లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (SRH vs KKR) ఢీకొంటున్నాయి. ఉప్పల్ మైదానమే ఇందుకు వేదిక. మరి ఆరెంజ్ ఆర్మీ రెండో విజయం అందుకుంటుందా?
SRH vs KKR Preview:
ఐపీఎల్ 2023లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (SRH vs KKR) ఢీకొంటున్నాయి. ఉప్పల్ మైదానమే ఇందుకు వేదిక. వీరిద్దరూ తలపడ్డ మొదటి మ్యాచులో సన్‌రైజర్స్ విజయ దుందుభి మోగించింది. నేటి మ్యాచులోనూ గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక నితీశ్ రాణా టీమ్ సిచ్యువేషన్ ఘోరంగా ఉంది! మరి నేటి పోరులో విజయం ఎవరిని వరించేనో!
గెలిస్తే.. ఛాన్స్!
టీ20 ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను కొనుక్కున్నప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలరాత మారలేదు. ఈ సీజన్లో మరీ పేలవ ప్రదర్శనలే చేస్తోంది. 8 మ్యాచుల్లో 3 గెలిచి 6 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇంకో రెండు మ్యాచులు ఓడితే ఇక ఇంటికే! ఓపెనింగ్ పెయిర్ విషయంలో ప్రయోగాలు మానేస్తే బెటర్! అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌ను కొనసాగిస్తే మంచిది. పైగా అభిషేక్ ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, క్లాసెన్ రాణించాలి. ఈడెన్లో కోల్‌కతాపై హ్యారీబ్రూక్ సెంచరీ కొట్టాడు. ఉప్పల్‌లోనూ అది రిపీటైతే బాగుంటుంది. బ్యాటర్లంతా మంచి ఇంటెంట్‌తో ఆడటం ముఖ్యం! బౌలింగ్ పరంగా ఇబ్బందులేమీ లేవు కానీ పరుగులు ఎక్కువగా ఇస్తున్నారు. భువీ, నటరాజన్ వికెట్లు తీయాలి. సుందర్ లేకపోవడంతో స్పిన్ డిపార్ట్‌మెంట్‌కు ఇబ్బందే! మయాంక్ డాగర్ ఆ పని చేసి పెట్టగలడు. మర్కండే తోడుగా ఉంటాడు. కష్టపడితే ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలని జట్టు సన్‌రైజర్స్‌కు ఉంది.
గెలిచినా.. ఫాయిదా లేదు!
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (Kolkata Knightriders) ఇది చావో రేవో మ్యాచ్! 9 మ్యాచుల్లో గెలిచింది మూడే. సన్‌రైజర్స్‌పై ఓడితే ప్లేఆఫ్ ఆశలు ఖతం! ఒకవేళ గెలిచినా మిగిలిన నాలుగు మ్యాచుల్లో విజయాలు అందుకోవాలి. ఇది చాలా కష్టం! ఓపెనింగ్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే ఆరు ఓపెనింగ్ పెయిర్స్‌ను మార్చింది. గాయంతో దూరమైన జేసన్ రాయ్ వస్తే మెరుపులు మెరిపించగలడు. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్ పోరాడుతున్నారు. ఆండ్రీ రసెల్ తన పేరుకు తగ్గట్టు డిస్ట్రక్టివ్ ఇన్నింగ్సేమీ ఆడలేదు. శార్దూల్ ఠాకూర్ కోలుకున్నాడు. బౌలర్లు పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. నరైన్ వికెట్లు తీయడం లేదు. వరుణ్ చక్రవర్తి శ్రమిస్తున్నాడు. వైభవ్ ఆరోరాకు అనుభవం లేదు. ఉమేశ్ గాయపడ్డాడు. విదేశీ పేసర్లు అస్సలు ఫామ్‌లో లేరు. ఇలాంటి జట్టు గెలవడం అంత ఈజీ కాదు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.