SRH vs DC Preview: డేవిడ్ భాయ్.. ఆగయా! ఉప్పల్ కోటలో సన్‌రైజర్స్ కాచుకుంటుందా!
SRH vs DC Preview: ఐపీఎల్ 2023లో సోమవారం 34వ మ్యాచ్ జరుగుతోంది. ఎలాంటి అంచనాల్లేని సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి.
SRH vs DC Preview:
ఐపీఎల్ 2023లో సోమవారం 34వ మ్యాచ్ జరుగుతోంది. ఎలాంటి అంచనాల్లేని సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ మైదానం ఇందుకు వేదిక. రెండు జట్లూ వరుస ఓటములతో కుదేలయ్యాయి! డేవిడ్ భాయ్ తిరిగి హైదరాబాద్‌లో ఆడుతుండటమే కాస్త ఎగ్జైటింగ్! మరి వీరిలో గెలుపెవరిది? ఏ జట్టు పరిస్థితి ఎలావుంది?
ప్చ్.. డీసీ!
పేపర్‌పై బలంగా కనిపిస్తూ.. మైదానంలోకి వెళ్లగానే నీరుగారిపోతున్న దిల్లీ క్యాపిటల్స్‌ను చూస్తుంటే జాలేస్తోంది! రిషభ్ పంత్ లేకపోవడంతో ఎక్స్‌ఫ్యాక్టర్ ఇంపాక్ట్ ఉండటమే లేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా ఒక్కరంటే ఒక్కరి స్కోరూ 100 దాటలేదు. మనీశ్ పాండే ఒకటో రెండో ఇన్నింగ్సుల్లో కాస్త నిలబడ్డాడు. కోట్లకు కోట్లు పెట్టి కొనుకున్న రిలీ రొసొ, ఫిల్ సాల్ట్, రోమన్ పావెల్ చేసిన స్కోర్లు వరుసగా 44, 5, 44 మాత్రమే. ఇంటర్నేషనల్ క్రికెట్లో బెస్ట్ ఆల్‌రౌండర్ అనుకున్న మిచెల్ మార్ష్ 4 మ్యాచుల్లో చేసింది జస్ట్ 6 రన్స్. ఇప్పటి వరకు 12 మార్పులు చేసిన డీసీ ఒక్కసారీ ఒకే జట్టును దింపలేదు. బౌలింగ్ పరంగానూ ఇబ్బందులున్నాయి. ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. ఇషాంత్, నోకియా, ముకేశ్ ఫర్లేదు. కుల్‌దీప్, అక్షర్, స్పిన్ చూస్తున్నారు. ఆడిన తొలి బంతి నుంచే బౌండరీలు బాదేసే పృథ్వీ షా ఒక్క మ్యాచులోనూ మెరుపులు మెరిపించలేదు.
ఇదైనా గెలుస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటో అర్థమవ్వడం లేదు. వేలంలో కొన్నది మంచి ఆటగాళ్లనే. చెల్లించిందీ భారీ మూల్యమే! కానీ రిజల్టు ఎప్పట్లాగే జీరో! ఇప్పటికే ఓపెనింగ్ జోడీలను చాలాసార్లు మార్చారు. ముంబయిలో కొట్టిన సెంచరీ తప్ప హ్యారీ బ్రూక్ చేసిందేమీ లేదు. ఆఫ్‌సైడ్ రూమ్ ఇవ్వకపోతే అతడు రన్స్ చేయడం లేదు. ఇప్పుడు అభిషేక్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తున్నారు. కొన్నాళ్లు ఇదే జోడీ కొనసాగిస్తామని అంటున్నారు. మయాంక్‌ను ఫ్లోటర్‌గా వాడతారట. రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, క్లాసెన్ ఆడిందేమీ లేదు. మార్కో ఎన్‌సన్ ఇంటెంట్ చూపిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బౌలర్లు బాగానే ఉన్నా వికెట్లు పడగొట్టం లేదు. స్కోర్లు నియంత్రించడం లేదు. భువీ బౌలింగ్‌లో పస తగ్గింది. మాలిక్, నట్టూ, ఎన్‌సన్ పేస్ ఫర్వాలేదు. డాగర్, మర్కండే, సుందర్ స్పిన్ చూస్తారు. మార్‌క్రమ్ నిర్ణయాల్లో తడబాటు కనిపిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్.