MS Dhoni Injury: బెంగళూరు మ్యాచ్‌లో ధోని ఆడతాడా? - చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఏం అన్నాడంటే?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని నేటి మ్యాచ్‌లో ఆడతాడా?
MS Dhoni Fitness, RCB vs CSK: ఐపీఎల్ 16లో నేడు (ఏప్రిల్ 17వ తేదీ) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ప్రస్తుతం మోకాలి గాయంతో ధోని ఇబ్బంది పడుతున్నాడు. ఆర్‌సీబీతో జరిగే ఈ మ్యాచ్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి సారథ్యం వహిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ధోనీ ఆడతాడనే ధీమాను వ్యక్తం చేశాడు.
ఈరోజు ధోనీ ఆడతాడా?
కాశీ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ, "అతను మ్యాచ్‌కు దూరమవుతాడని నేను అనుకోను. కానీ మనం వేచి ఉండాలి." అన్నాడు. అంతకుముందు మార్చి 17వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కాస్త తడబడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 17 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ చెన్నై మాత్రం ఓటమి పాలైంది.
ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని పలువురు ఆటగాళ్లు కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ జాబితాలో ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, సిసంద మగల ఉన్నారు. మగల రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇది కాకుండా జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పూర్తి ఫిట్‌నెస్ పొందాలంటే నెలాఖరు వరకు ఆగాల్సిందే.
అద్భుతమైన ఫాంలో మహేంద్రుడు
విశేషమేమిటంటే ఐపీఎల్ 2023లో మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. అతను జట్టు కోసం కొన్ని అద్భుతమైన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో ధోనీ రెండు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోనీ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండు సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్‌సీబీపై మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు 32 ఇన్నింగ్స్‌ల్లో 849 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఇప్పటివరకు 962 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ పేరు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
అన్ని జట్లకు ధోని పవర్ హిట్టింగ్ గురించి బాగా తెలుసు. ఈ విషయం IPL 2023 సీజన్‌లో కూడా అతని బ్యాటింగ్‌లో కనిపించింది. ధోని సులభంగా బంతిని బౌండరీ దాటిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని పేరిట 235 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ధోని పేరు మీద ఉంది. అతను ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 46 సిక్సర్లు కొట్టాడు.