అన్వేషించండి

Shubman Gill: నాలుగు మ్యాచ్‌ల్లో మూడో సెంచరీ - ఈ ఐపీఎల్ శుభ్‌మన్ గిల్‌దే!

ఐపీఎల్‌లో తను ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గిల్ మూడు సెంచరీలు సాధించాడు.

Shubman Gill Century Orange Cap IPL 2023: ఈ సీజన్‌లోని రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్‌ను వెనక్కి నెట్టాడు. ఈ సీజన్‌లో గిల్ ఆరెంజ్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయమైనట్లే.

ఈ ఏడాది ప్రారంభం నుంచి శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీని నమోదు చేశాడు. ఇది కాకుండా, వన్డే క్రికెట్‌లో అతని బ్యాట్ నుంచి డబుల్ సెంచరీ కూడా వచ్చింది. 23 ఏళ్ల గిల్ ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా నిరూపించుకున్నాడు.

క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు ముందు, శుభ్‌మన్ గిల్ 15 ఇన్నింగ్స్‌లలో 55.54 సగటుతో 722 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు గిల్, డు ప్లెసిస్ మధ్య తేడా కేవలం 8 పరుగులు మాత్రమే. ఈ సీజన్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ బ్యాట్ మూడు సెంచరీలు సాధించింది.

లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 13వ మ్యాచ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించాడు. మొదటి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 42 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ సెంచరీ సాధించాడు.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మూడో అద్భుత సెంచరీ
రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో 129 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా, షేన్ వాట్సన్, జోస్ బట్లర్, రజత్ పాటిదార్ ఈ ఘనత సాధించారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 రెండో క్వాలిఫయర్‌లో పరుగుల వరద పారింది. మొతేరాలో సిక్సర్ల వర్షం కురిసింది. మోదీ స్టేడియంలో బౌండరీల హోరు సాగింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (129; 60 బంతుల్లో 7x4, 10x6) తన సొగసైన బ్యాటింగ్‌తో అభిమానులను ఓలాలాడించాడు. స్టేడియం మొత్తాన్నీ గిల్‌ఫైడ్‌ చేశాడు. తిరుగులేని విధంగా సీజన్లో మూడో సెంచరీ కొట్టేశాడు. దాంతో సెమీ ఫైనల్‌ లాంటి ఈ మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. ముంబయి ఇండియన్స్‌కు 234 పరుగుల టార్గెట్‌ సెట్‌ చేసింది. సాయి సుదర్శన్‌ (43; 31 బంతుల్లో 5x4, 1x6) టైమ్లీ ఇన్నింగ్స్‌ ఆడేశాడు.

తొమ్మిది ఓవర్లకు స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకొనేప్పటికీ గుజరాత్‌ స్కోరు 80/1. బ్రేక్‌ నుంచి రాగానే బౌండరీ కొట్టి 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టాడు గిల్‌. ఆ తర్వాత భీకరమైన హిట్టింగ్‌ చేశాడు. బంతి పట్టుకున్న ప్రతి బౌలర్‌ను అటాక్‌ చేశాడు. ఎలాంటి బంతులు వేసినా స్టాండ్స్‌లోకి పంపించాడు. దాంతో 14 ఓవర్లకు 147/1 వద్ద ముంబయి రెండో టైమౌట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఎన్ని బ్రేక్‌లు వచ్చినా గిల్‌ అటాకింగ్‌ మాత్రం ఆపలేదు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 192 వద్ద అతడిని ఆకాశ్ మధ్వాల్‌ ఔట్‌ చేశాడు.   214 వద్ద సుదర్శన్‌ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య (28*; 13 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి స్కోరును 233/3కు చేర్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget