ఆసక్తికరంగా మారిపోయిన ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ రేసు
ఆసక్తికరంగా మారిపోయిన ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ రేసులీగ్ దశలో చివరి స్టేజ్ కు చేరుకున్న అన్ని జట్లుఇప్పటికీ తేలని ప్లే ఆఫ్ బెర్తులుప్రస్తుతానికి ప్లే ఆఫ్ రేసులో అన్ని జట్లు
ఈసారి ఐపీఎల్ ఫ్యాన్స్ కి మస్తు మజా ఇస్తోంది. సీజన్ లో నాలుగు టీమ్స్ 11 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. అన్ని టీమ్స్ 10 మ్యాచ్ లు ఆడేశాయి. ఇంక మిలింది ఒక్కో టీమ్ కి మూడు నాలుగు మ్యాచ్ లే. అయినా ప్లే ఆఫ్ బెర్త్ లు ఇంకా తేలలేదు. అఫీషియల్ ఏ టీమ్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేదు. ఏ టీమూ ఐపీఎల్ 2023 సీజన్ నుంచి ఎలిమినేట్ కాలేదు. ఇలా జరగటం అరుదు అనే చెప్పాలి.
ఇన్నాళ్లూ మ్యాచ్ కి రావటం గెలుస్తుందేమోననే ఎగ్జైట్ కావటం చివరికి నిరాశగా మొహం పెట్టుకుని వెనక్కి వెళ్లిపోయిన సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ఇక హ్యాపీగా ఉండటం ఎగిరి గంతేయొచ్చని నిన్న మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.కారణం లాస్ట్ రెండు మ్యాచుల్లో పాయింట్ల పట్టికలో చివరాఖర్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ తోప్ టీమ్స్ కి షాక్ ఇవ్వటంతో ఆ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేసుల్లోకి వచ్చేశాయి.
ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ కి 16 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కి 13 పాయింట్లతో రెండో స్థానంలో..ప్రస్తుతానికి 11 పాయింట్లతో లక్నో మూడో స్థానంలో...10 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ నాలుగు జట్లకి మిగిలింది మూడేసి మ్యాచ్ లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న పాయింట్ల ప్రకారం మొదటి బెర్త్ గుజరాత్ కి కన్ఫర్మ్ చేసుకుంటుంది అని భావించవచ్చు.
మిగిలిన టీమ్స్ అన్నీ కూడా మిగిలిన మూడు స్థానాలకు పోటీ పడాలి. తమకున్న ఆఖరి నాలుగు మ్యాచుల్లో అద్భుతాలు చేస్తే ఢిల్లీ, హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ బెర్త్ లు దక్కించుకోవచ్చు. కాకపోతే దానికి మిగిలిన టీమ్స్ రన్ రేట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా సమీకరణాలు ఉంటాయి. మరి ఎవరు ఎవరికి షాకిస్తారో..ఎవరు ప్లే ఆఫ్ బెర్తులను దక్కించుకుంటారో రానున్న మ్యాచుల్లో చూడాలి. ఇకపై మ్యాచ్ లు మాత్రం మాంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతాయనటంలో మాత్రం సందేహం లేదు.
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ డ్రమెటిక్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. సందీప్ శర్మ వేసిన బంతిని అబ్దుల్ సమద్ బలంగా కొట్టాడు. అది నేరుగా లాంగాఫ్‌లో ఉన్న జోస్ బట్లర్ చేతిలో పడింది. దీంతో రాజస్తాన్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే షాక్. సందీప్ వేసింది నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. దీంతో లక్ష్యం ఒక్క బంతికి నాలుగు పరుగులుగా మారింది. ఈ దశలో సందీప్ వేసిన బంతిని అబ్దుల్ సమద్ నేరుగా సిక్సర్‌గా తరలించాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ టార్గెట్‌ను దగ్గరకు తీసుకురాగా, అబ్దుల్ సమద్ ఒత్తిడిలో భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.