IPL 2023 Mini Auction: ఈ ఐపీఎల్ వేలంలో ఎక్కువ డబ్బులు అతనికే - రణ్‌వీర్ సెలెక్ట్ చేసింది ఎవరినో తెలుసా?
ఈ ఐపీఎల్ వేలంలో రణ్‌వీర్ సింగ్ ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.
IPL Auction 2023: IPL వేలం 2023 శుక్రవారం కొచ్చిలో జరగనుంది. ఈ వేలానికి దాదాపు అన్ని జట్లు తమ సన్నాహాలను పూర్తి చేశాయి. అయితే ఈ వేలానికి ముందు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన స్పందనను తెలియజేశాడు. కొచ్చిలో జరగనున్న వేలంపై ఆయన మాట్లాడారు. దీంతో పాటు వేలంలో ఏ ఆటగాడిపైనా డబ్బుల వర్షం కురిపించవచ్చని చెప్పాడు. ఇంగ్లండ్ బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్‌లు భారీ మొత్తాన్ని అందుకోవచ్చని బాలీవుడ్ స్టార్ చెప్పాడు.
ఐపీఎల్ వేలంపై రణవీర్ సింగ్ ఏం చెప్పాడు?
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ అంచనా ప్రకారం, వేలంలో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్, శామ్ కరన్ అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కావచ్చు. అయితే శామ్ కరన్ కంటే బెన్ స్టోక్స్ ఎక్కువ డబ్బు సంపాదించగలడని చెప్పాడు. బెన్ స్టోక్స్ పెద్ద సందర్భాలలో గొప్ప ఆటను కనబరిచారని, దాని వల్ల బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలంలో చాలా డబ్బు పొందగలడని రణవీర్ సింగ్ చెప్పాడు. స్టోక్స్ అత్యంత ఖరీదైన ఆటగాడు అని రణ్‌వీర్ సింగ్ భావిస్తున్నాడు.
కీరన్ పొలార్డ్‌కు ప్రత్యామ్నాయం లేదు
ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఐపీఎల్ అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడాడు. రణవీర్ సింగ్ ప్రకారం కీరన్ పొలార్డ్ స్థానంలో వేరే ఆటగాడిని ముంబై ఇండియన్స్ కనుగొనడం చాలా కష్టం. నిజానికి కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కి వీడ్కోలు పలికాడు. అతను 2010 నుండి ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు.
ముంబై ఇండియన్స్ విజయంలో కీరన్ పొలార్డ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శామ్ కరన్, కామరూన్ గ్రీన్ గొప్ప ఆటగాళ్లని, అయితే కీరన్ పొలార్డ్‌కు ప్రత్యామ్నాయం లేదని రణవీర్ సింగ్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు కీరన్ పొలార్డ్ అందించిన సహకారం అభినందనీయం అన్నాడు.
View this post on Instagram
View this post on Instagram