LSG vs MI: ఓటమికి కారణం అదే - కానీ బాధ్యత మాత్రం నాదే - లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా ఏమన్నాడంటే?
ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కెప్టెన్ కృనాల్ పాండ్యా పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు.

Indian Premier League, LSG vs MI: ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 81 పరుగుల తేడాతో ఏకపక్ష ఓటమిని చవిచూసింది. దీంతో ఈ సీజన్‌లో లక్నో ప్రయాణం కూడా ముగిసింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ 101 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన లక్నో అనంతరం 32 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘ఈ మ్యాచ్‌లో ఒక దశలో మేం చాలా మంచి స్థితిలో ఉన్నాం. కానీ అకస్మాత్తుగా విషయాలు చాలా వేగంగా మారిపోయాయ. నేను కూడా తప్పుడు షాట్ ఆడాను. మేం మెరుగైన ఆటను ప్రదర్శించి ఉండాల్సింది. నేను ఆ షాట్ ఆడకూడదు. ఈ ఓటమికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌పైకి బాగా వస్తోంది. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.’ అని మ్యాచ్ అనంతరం చెప్పాడు.
స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తర్వాత తాము మెరుగైన ఆటను కనబరచలేకపోయామని కృనాల్ పాండ్యా అన్నాడు. ‘క్వింటన్ డి కాక్ మంచి ఆటగాడు. అయితే ఇక్కడ కైల్ మైయర్స్‌కు మెరుగైన రికార్డు ఉంది. అందుకే అతడిని ఈ జట్టులో చేర్చాలని నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ మెరుగైన ఆటను ప్రదర్శించారు. వారి ఫాస్ట్ బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు.’ అని తెలిపాడు
రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్‌తో ముంబై ఢీ
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫయర్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు వారు మే 26వ తేదీన అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడాల్సి ఉంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ 15 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

