News
News
వీడియోలు ఆటలు
X

LSG vs RCB Preview: ఆర్సీబీకి లక్నో డేంజర్‌! టేబుల్‌ టాపర్‌ అయ్యేందుకు గుడ్‌ ఛాన్స్‌!

LSG vs RCB Preview: ఇండియన్ ప్రీమియర్‌ లీగులో నేడు 43వ మ్యాచ్‌ జరుగుతోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి.

FOLLOW US: 
Share:

LSG vs RCB Preview: 

ఇండియన్ ప్రీమియర్‌ లీగులో నేడు 43వ మ్యాచ్‌ జరుగుతోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. వీరిద్దరూ తలపడ్డ చివరి మ్యాచ్‌ థ్రిల్లర్‌ సినిమాను చూపించింది. మరి నేటి పోరులో గెలిచేదెవరు? ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంటుందా?

డేంజరస్‌ లక్నో!

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఒక్కసారిగా తమ వ్యూహం మార్చేసింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌గా ఆడాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే గెలిచే మ్యాచుల్నీ చిన్న చిన్న తేడాలతో పోగొట్టుకోవడమే ఇందుకు కారణం. అందుకే వికెట్‌ పోయినా సరే మొహాలిఆలో కేఎల్‌ రాహుల్‌ వేగంగా ఆడేందుకు ట్రై చేశాడు. ఇక కైల్‌ మేయర్స్‌ క్రీజులో నిలిస్తే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. ఆయుష్ బదోనీ ఫామ్‌లోకి వచ్చేశాడు. దీపక్‌ హుడా మూమెంటమ్‌ అందుకున్నాడు. ఇక విండీస్‌ వీరుడు నికోలస్‌ పూరన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అపోజిషన్‌ బౌలింగును ఊచకోత కోస్తున్నారు. మొహాలిలో ఫీల్డింగ్‌ చేస్తుండగా స్టాయినిస్‌ చేతికి గాయమైంది. స్కానింగ్‌లో మరీ సీరియస్‌ లేదని తెలిసింది. అయితే రెస్ట్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కొంత జాగ్రత్తగా ఉండాలి. బిష్ణోయ్ రన్స్‌ లీక్‌ చేస్తున్నాడు. అమిత్‌ మిశ్రా ఫర్వాలేదు. అవేశ్‌, నవీన్‌ ఉల్‌ హఖ్‌ బౌలింగ్‌ అదుర్స్‌. మార్క్‌వుడ్‌, మేయర్స్‌, స్టాయినిస్‌ అందుబాటులో ఉన్నారు. ఇండియన్‌ కుర్ర పేసర్లూ సత్తా చాటుతున్నారు.

టాప్‌-3 పైనే భారం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు ఎక్కువగా హోమ్‌ గేమ్స్‌ ఆడింది. తొలి ఎనిమిదిలో ఆరు చిన్నస్వామిలోనే జరిగాయి. కర్ణాటక ఎలక్షన్ల వల్ల ఇలా షెడ్యూలు చేశారు. ఇప్పుడికి ఎక్కువగా అవే.. గేమ్స్‌ ఆడాల్సి ఉంటుంది. మొదట డిఫికల్ట్‌ ఏకనాకు వస్తోంది. అయితే బౌలింగ్‌ ఫ్రెండ్లీ కండీషన్స్‌ ఉంటాయి కాబట్టి సిరాజ్‌, హర్షల్‌, హసరంగ, షాబాజ్‌ చెలరేగుతారు. డేవిడ్‌ విలే గాయపడటంతో జోష్‌ హేజిల్‌ వుడ్‌ ఆడే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో సిరాజ్ బౌలింగ్‌ అదుర్స్‌! బ్యాటింగ్‌ ఆర్డర్లో మాత్రం వీక్‌నెస్‌లు ఉన్నాయి. టాప్‌ 3లో కోహ్లీ, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ మినహా ఎవ్వరూ ఆడటం లేదు. వీరిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిడిలార్డర్‌ కొలాప్స్‌ అవ్వడం ఖాయమే! దినేశ్ కార్తీక్‌ అంతగా ఫామ్‌లో లేడు. అయితే ఏకనాలో లక్నో బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయొద్దు. డుప్లెసిస్‌ పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉన్నాడో లేదో తెలియడం లేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.

Published at : 01 May 2023 10:48 AM (IST) Tags: Virat Kohli KL Rahul Lucknow Super Giants IPL 2023 LSG vs RCB Royal Challengers Bangalore

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?