Hydra: జూబ్లిహిల్స్ లో రెండెకరాల పార్క్ స్థలానికి విముక్తి - కబ్జా చెర నుంచి కాపాడిన హైడ్రా
Hyderbad: హైదరాబాద్ లో హైడ్రా రెండు ఎకరాల పార్క్ స్థలాన్ని కబ్జా నుంచి కాపాడింది. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పక్కన ఉన్న స్థలాన్ని వ్యక్తి కబ్జా చేశాడు.

Hydra Action: హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి భూములకు విముక్తి ప్రసాదిస్తోంది హైడ్రా. ఇటీవల పోలీస్ స్టేషన్ ప్రారంభించడంతో పాటు రెండు వందల మంది డ్రైవర్లను కూడా రిక్రూట్ చేసుకుంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినట్లుగా తమ దృష్టికి వస్తే విరుచుకుపడుతోంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి.. పార్క్ తో పాటు నారా స్థలాన్ని కబ్జా చేశాడు. భవనాలు నిర్మించి వాటిని హాస్టళ్లకు అద్దెకు ఇచ్చి ఏకంగా నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాయి.
ఈ వ్యక్తి పార్క్ స్థలాన్ని కబ్జా చేయడానికి వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ముందుగా ఆ స్థలం పక్కనే ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తన అసలు విశ్వరూపం చూపించడం ప్రారంభించాడు. ముందుగా అద్దెకు భ వనం ఇచ్చిన వారిని బెదిరించడం ప్రారంభించాడు. తర్వాత మెల్లగా పార్క్ స్థలాన్ని, నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు ప్రారంభించాడు.
జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 41 పెద్దమ్మ గుడికి దగ్గరలోని ఆక్రమణలను తొలగించిన హైడ్రా.
— HYDRAA (@Comm_HYDRAA) May 23, 2025
🔷నాలాతో పాటు పార్కు రహదారిని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా.
🔷దీంతో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కుకు లభించిన దారి.
🔷ఒక యింటిని అద్దెకు తీసుకొని.. ఓనర్ కు… pic.twitter.com/BzpgFX2Hzb
వారు తమ ఇళ్లు ఖాళీ చేయాలని ఎంత ఒత్తిడి చేసినా చేయలేదు. దీంతో ఆయన చేస్తున్న కబ్జాలపై ఆ ఇంటి ఓనర్లు పోలీసులకు, గ్రేటర్ కు ఫిర్యాదు చేశారు. అయితే న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని భఊముల్ని ఎలా అనుభవించాలో ముందుగానే తెలుసుకున్న ఆయన.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడు.అయితే సుప్రీంకోర్టు అతని వాదనను ఖండించింది. నాలాలు, పార్కుల స్థలాన్ని ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పార్క్, నాలా స్థలాల్లో ఉన్న భవనాలను కూల్చివేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. ఆ ఓవర్ ..సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడానికి నిరాకరించడంతో.. హైడ్రా రంగంలోకి దిగింది. మొత్తం కూల్చివేసింది. పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ స్థలం అత్యంత ఖరీదైనది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో ఉంటుంది. ఈ స్థలంలో గ్రేటర్ హైదరాబాద్ మంచి పార్కు నిర్మిస్తుందని.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
చెరువులను, ప్రభుత్వ స్దలాలను కబ్జా కోరల నుండి మిముక్తి కలిగించిన క్రెడిట్ ఒక్క హైడ్రాకు మాత్రమే దక్కుంది. అంతలా దూసుకుపోతున్న హైడ్రా నేటి నుండి మరింత పవర్ ఫుల్ గా మారనుంది. తెలంగాణలో తొలిసారి హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్దలాలు ఆక్రమిస్తే , కబ్జాదారులు గీతదాటితే , భరతం పట్టేందుకు నేటి నుండి హైడ్రా పోలీసులు రంగంలోకి దిగనున్నారు. హైదరాబాద్ నగరంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఇంకా కబ్జాకోరల్లోనే ఉన్నాయి. హైడ్రా ప్రయత్నం కొంతమేరకు సక్సెస్ అయినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. ఈ క్రమంలో హైడ్రా మరింత బలోపేతం చేసేందుకు, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా పోలీస్టేషన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హై





















