GT vs PBKS Highlights: పంజాబ్‌పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ - చెమట్లు పట్టించిన కింగ్స్ బౌలర్లు!
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్లతో ఓటమి పాలైంది.
IPL 2023, GT vs PBKS: ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌తో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (36: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ (67: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (30: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు) వేగంగా ఆడారు. వీరు మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడుతున్న రబడ వేగంగా ఆడుతున్న సాహాను అవుట్ చేసి గుజరాత్‌ను దెబ్బ తీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (19: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడలేకపోవడంతో స్కోరింగ్ రేటు తగ్గిపోయింది.
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (8: 11 బంతుల్లో, ఒక ఫోర్), డేవిడ్ మిల్లర్ (17: 18 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వేగంగా ఆడటంలో విఫలం అయ్యారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో గుజరాత్‌కు ఇబ్బందులు ఎదురు కాలేదు. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు కావాల్సిన దశలో రాహుల్ టెవాటియా (5: 2 బంతుల్లో, ఒక ఫోర్) బౌండరీతో గుజరాత్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాట్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0: 2 బంతుల్లో), శిఖర్ ధావన్ (8: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) ఇద్దరూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
కానీ మాథ్యూ షార్ట్ (36: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), భానుక రాజపక్స (20: 26 బంతుల్లో, ఒక ఫోర్) పంజాబ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. అయితే భానుక రాజపక్స మరీ నిదానంగా ఆడాడు. దీంతో స్కోరింగ్ రేటు బాగా పడిపోయింది. వీరు మూడో వికెట్‌కు 27 పరుగులు జోడించారు.
ఆ తర్వాత జితేష్ శర్మ (25: 23 బంతుల్లో, ఐదు ఫోర్లు), శామ్ కరన్ (22: 22 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు. కానీ చివర్లో షారుక్ ఖాన్ (22: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కొంచెం వేగంగా ఆడటంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్