By: ABP Desam | Updated at : 15 May 2023 11:17 AM (IST)
హార్దిక్ పాండ్య, అయిడెన్ మార్‌క్రమ్ ( Image Source : Twitter, SRH )
IPL 2023, GT vs SRH:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు 62వ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (GT vs SRH) తలపడుతున్నాయి. ఇందులో గెలిచి ప్లేఆఫ్ చేరుకొన్న తొలి జట్టుగా నిలవాలని పాండ్య సేన పట్టుదలగా ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. మరి విజయం ఎవరిని వరించేనో..!
గెలిస్తే ప్లేఆఫ్!
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మొతేరాను తమ కంచుకోటా మార్చేసుకుంది! హోమ్ కండీషన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంటోంది. అక్కడ పాండ్య సేనను ఓడించడం ప్రత్యర్థులకు సులువేం కాదు. పైగా జట్టులో అంతా ఫామ్‌లో ఉన్నారు. బ్లాస్టింగ్ ఓపెనింగ్ అందించే ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఉన్నారు. మిడిలార్డర్లో ఆదుకొనే.. హార్దిక్ పాండ్య (Hardik Pandya), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ చెలరేగుతున్నారు. రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. లీగులోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్, స్పిన్నర్ గుజరాత్‌కు కొండంత బలం. పవర్‌ప్లేలో కొత్త బంతితో మహ్మద్ షమి దుమ్ము రేపుతున్నాడు. మొహిత్ శర్మ, పాండ్య, జెసెఫ్ అతడికి అండగా ఉన్నారు. రషీద్ ఖాన్ పరుగులిస్తున్న వికెట్లు పడగొడుతున్నాడు. అతడికి తోడుగా నూర్ అహ్మద్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ ఇందులో గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్ కన్ఫామ్ చేసుకుంటుంది. ఆఖరి మ్యాచులో గెలుపోటములతో సంబంధం లేకుండా నంబర్‌వన్‌లోనే ఉంటుంది.
గెలిచినా ప్లేఆఫ్ డౌటే!
మొతేరాలో గుజరాత్‌ను ఢీకొంటున్న సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) గెలవాలంటే అద్భుతమే జరగాలి! ఈ మ్యాచులో విజయం అందుకొంటేనే హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. అప్పటికీ మిగతా రెండిట్లో భారీ మార్జిన్‌తో గెలవాలి. మిగతా జట్ల గెలుపోటములూ వీరికి అనుకూలంగా ఉండాలి. అంటే టెక్నికల్‌గా సాధ్యమే కానీ సులభం కాదు! పాపం..! అన్నీ ఉన్నా హైదరాబాద్‌కు ఎక్కడో తేడా కొడుతోంది. అందుకే వరుసగా మూడో సీజన్లోనూ ప్లేఆఫ్‌కు రాకుండా.. ఆఖర్లోనే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. టైటాన్స్ తరహాలో బ్లాస్టింగ్ ఓపెనర్లు వీరికి లేరు! మిడిలార్డర్లోనూ నిలకడ లేదు. హెన్రిచ్‌క్లాసెన్ ఒక్కడే రాణిస్తున్నాడు. గ్లెన్ ఫిలిప్స్, మార్‌క్రమ్ ఫర్వాలేదు. బౌలింగ్ పరంగానూ ఘోరంగా ఉంది. ఒక్కరు మాత్రమే పది వికెట్లు పడగొట్టారు. అదే గుజరాత్‌లో నాలుగు పదికి పైగా వికెట్లు తీశాడు. మయాంక్ మర్కండే స్పిన్ ఓకే. అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ సన్‌రైజర్స్ వ్యూహాలు ఏమాత్రం బాగాలేవు! మార్‌క్రమ్ (Aiden Markram) కెప్టెన్సీ లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి.
Also Read: ఫ్యాన్ బాయ్ గా మారిన సునీల్ గవాస్కర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Byjus Loan Default: బైజూస్‌కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!