GT vs CSK Qualifier 1: ధోనీ.. యుద్ధం గెలవాలంటే ఈ 'గన్స్'ను దాటాలి! లేదంటే కొలాప్స్!
GT vs CSK Qualifier 1: తమ కంచుకోట చెపాక్‌లో అడ్వాండేజ్ క్యాష్ చేసుకోవాలని ధోనీసేన పట్టుదలగా ఉంది. కానీ ముగ్గురు బౌలర్లతో వారికి ముప్పు పొంది ఉంది! వారిని దాటితేనే 'విజయ లక్ష్మి' వరించడం కష్టం!
GT vs CSK Qualifier 1:
ఐదోసారి కప్పు గెలవాలన్న కసితో వస్తోంది చెన్నై సూపర్ కింగ్స్! తమ గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తోంది గుజరాత్ టైటాన్స్! సేమ్ క్వాలిటీస్ ఉన్న ఈ రెండు జట్లు తొలి క్వాలిఫయర్‌లో ఢీకొంటున్నాయి. తమ కంచుకోట చెపాక్‌లో అడ్వాండేజ్ క్యాష్ చేసుకోవాలని ధోనీసేన పట్టుదలగా ఉంది. కానీ ముగ్గురు బౌలర్లతో వారికి ముప్పు పొంది ఉంది! వారిని సమర్థంగా ఎదుర్కొంటే తప్ప 'విజయ లక్ష్మి' వరించడం కష్టం!
హెవీ బ్యాటింగ్!
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) లిమిటెడ్ రిసోర్సెస్‌తో బరిలోకి దిగింది. బౌలింగ్ డిపార్ట్‌మెంట్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. దాంతో బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌పై ఎక్కువ ఆధారపడింది. మొదట బ్యాటింగ్‌కు దిగితే విధ్వంసకర హిట్టింగ్‌తో ఎక్కువ పరుగులు చేశారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఇదే మంత్రం పఠించారు. ఇక చెపాక్‌లో స్లో ట్రాక్స్‌పై స్పిన్నర్లను ఉపయోగించుకున్నారు. అందుకే క్వాలిఫయర్ వన్‌లో సీఎస్కే బ్యాటర్లను అడ్డుకొనేందుకు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పక్కా ప్రణాళికతో దిగనుంది. మహ్మద్ షమి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ను ప్రయోగించనుంది. మీడియా పేసర్ మోహిత్ శర్మ, అల్జారీ జోసెఫ్, స్పిన్నర్లు రాహుల్ తెవాతియా, సాయి కిషోర్ వీరికి అండగా ఉంటారు.
షమీని దాటాలి!
సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లకు ప్రమాదం పొంచివుంది. ఈ సీజన్ మొత్తం రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే సూపర్ డూపర్ ఓపెనింగ్స్ ఇచ్చారు. వీరిద్దరినీ షమి అడ్డుకోగలడు. మిగతా బౌలర్లతో పోలిస్తే బ్యాక్ ఆఫ్ లెంగ్త్, గుడ్ లెంగ్త్ బంతులు ఎక్కువగా వేస్తున్నాడు. కచ్చితత్వం బాగుండటం అతడికి వరంగా మారింది. ఇక సందర్భాన్ని బట్టి బౌన్సర్లు, వైడ్ యార్కర్లు, ఫుల్ లెంగ్త్ బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్లో పవర్ ప్లే ఓవర్లలో 17.33 సగటు, 7.02 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌కు బ్యాటర్లు తప్పుగా స్పందిస్తున్న తీరు 36.94 శాతంగా ఉంది. అంటే మిగిలిన 9 వికెట్లు మధ్య ఓవర్లు, డెత్‌లో తీసినవే. 13 బంతులకు ఒకసారి వికెట్ తీస్తూ భయపెడుతున్నాడు. ఏ రకంగా చూసినా సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్‌కు అతడితో ముప్పు తప్పదు.
అఫ్గాన్.. స్పిన్ ద్వయం!
గుజరాత్ టైటాన్స్ సక్సెస్‌కు మరో కారణం అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్! మామూలు వికెట్లపైనే చుక్కలు చూపించే అతడు స్పిన్ ఫ్రెండ్లీ చెపాక్‌పై ఎలా చెలరేగుతాడో అర్థం చేసుకోవచ్చు. ఒకట్రెండు సార్లు పరుగులు ఇచ్చినా వికెట్లు తీసి ఒత్తిడి పెంచుతాడు. దాంతో మిగతా బౌలర్లపై వారు దాడికి దిగలేరు. ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 7.82 ఎకానమీ, 14 స్ట్రైక్‌రేట్, 18.25 సగటుతో 24 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో అతడిని ఆడటం చాలా కష్టం. షమీని దాటి మిడ్ స్టేజ్‌కు చేరుకున్నా చాలా సులభంగా రన్స్ కంట్రోల్ చేసేస్తాడు.
Also Read: చెపాక్‌లో ధోనీ బ్రిగేడ్ - కుంగ్ ఫూ పాండ్యతో ఢీ! తొలి ఫైనలిస్ట్ ఎవరో?
మూడు దశల్లో కవర్!
ఆలస్యంగా బరిలోకి దిగినా సరే నూర్ అహ్మద్ ఎఫెక్టివ్‌గా మారాడు. 10 మ్యాచుల్లో 7.96 ఎకానమీ, 16.69 స్ట్రైక్‌రేట్‌తో 13 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్‌తో బౌలింగ్లో మంచి పాట్నర్‌షిప్స్ నెలకొల్పుతున్నాడు. చెరో ఎండ్ నుంచి వీరిద్దరూ చేసే అటాక్‌కు బ్యాటర్లు జవాబివ్వడం అంత సులభమేమీ కాదు. ఇక ఇదే సమయంలో మీడియం పేస్ బౌలర్ మోహిత్ శర్మ రంగంలోకి దిగుతాడు. తన అనుభవాన్ని రంగరించి వికెట్లు తీస్తున్నాడు. డెత్‌లో గుజరాత్ అతడినే ఎక్కువగా విశ్వసిస్తోంది. అంటే పవర్ ప్లే, మిడ్ స్టేజ్, డెత్ ఓవర్లలో మిగతా బౌలర్లతో వీరు మిక్స్ అవుతారు కాబట్టి చెన్నై రన్స్ చేయడం నాట్ సో ఈజీ అన్నమాట!
It’s been 54 days since these memories, @ChennaiIPL #PhariAavaDe, #WhistlePodu 💙💛#GTvCSK | #TATAIPL Playoffs 2023 pic.twitter.com/7Ir53yn0Yd
— Gujarat Titans (@gujarat_titans) May 23, 2023