News
News
వీడియోలు ఆటలు
X

DC vs GT, IPL 2023: వార్నర్‌ భాయ్‌ గెలుస్తాడా? రెండో మ్యాచులో పాండ్య సేనతో ఢీ!

DC vs GT, IPL 2023: మంగళవారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. మరి ఇందులో గెలుపెవరిది!

FOLLOW US: 
Share:

DC vs GT, IPL 2023: 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మంగళవారం ఏడో మ్యాచ్‌ జరుగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం ఇందుకు వేదిక. తొలి మ్యాచులో గెలిచిన పాండ్య సేన జోరు మీదుంది. వార్నర్‌ బృందం తొలి గెలుపు కోసం ఎదురు చూస్తోంది. మరి ఇందులో గెలుపెవరిది!

కిర్రాక్‌ జీటీ!

చివరి మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన టార్గెట్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ ఈజీగా ఛేజ్‌ చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా మంచి ఫామ్‌లో ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌ గాయంతో దూరమైనా డేవిడ్‌ మిల్లర్‌ రాకతో ఇబ్బంది తీరిపోతుంది. సాయి సుదర్శన్‌ మంచి ఇన్నింగ్సే ఆడాడు. విజయ్‌ శంకర్‌లో పరిణతి కనిపిస్తోంది. మాథ్యూవేడ్‌ విజృంభిస్తే ఎలాంటి స్కోరైనా చేయగలడు. రాహుల్‌ తెవాతియా ఫినిషింగ్‌ టచ్‌ తెలిసిందే. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌, బ్యాటింగ్‌లో దుమ్మురేపగలడు. బౌలింగ్‌లోనే చిన్న చిన్న అడ్జస్ట్‌ మెంట్లు అవసరం. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమి అద్భుతం. అల్జారీ జోసెఫ్‌ పరుగుల్ని నియంత్రించాలి. జోష్‌ లిటిల్‌ పెర్ఫామెన్స్‌ బాగుంది. జయంత్‌ యాదవ్‌, సాయ్‌ కిషోర్‌ స్పిన్‌ చూసుకుంటారు.

డీసీ రివర్స్‌ అటాక్‌!

మొదటి మ్యాచులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో దిల్లీ క్యాపిటల్స్‌ కకావికలమైంది. ఏకంగా 50 రన్స్‌ తేడాతో ఓడింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఒక్కడే బ్యాటింగ్‌లో రాణించాడు. మార్క్‌ వుడ్‌ నిఖార్సైన పేస్‌కు బ్యాటర్లు విలవిల్లాడారు. పృథ్వీ షా వేగంగా ఆడగలడు. మిచెల్‌ మార్ష్‌ నిలబడితే మిడిలార్డర్‌కు కన్‌సిస్టెన్సీ వస్తుంది. సర్ఫరాజ్‌ ఖాన్‌, రోమన్‌ పావెల్‌, రిలీ రొసొ, ఫిల్‌ సాల్ట్‌ మెరుగ్గా ఆడాలి. బౌలింగ్‌ పరంగా దిల్లీ ఫర్వాలేదు. సరైన లెంగ్తులను త్వరగా అర్థం చేసుకోవాలి. ఖలీల్‌ అహ్మద్‌, కుల్‌దీప్‌ బౌలింగ్‌ బాగుంది. అక్షర్‌ పటేల్‌, చేతన్‌ సకారియా మరింత మెరుగ్గా ఆడాలి. సఫారీ పేసర్‌ ఆన్రిచ్‌ నోకియా, లుంగి ఎంగిడి వస్తే బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్ పటిష్ఠంగా మారుతుంది. ముకేశ్‌ ఫర్వాలేదు.

స్లో పిచ్‌

దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం మందకొడిగా ఉంటుంది. రానురాను  వికెట్‌ నెమ్మదిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. స్లో వేరియేషన్స్‌ ఉన్న పేసర్లు వికెట్లు తీయగలరు. కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌ దుమ్మురేపగలరు.

దిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్.

గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

Published at : 04 Apr 2023 09:00 AM (IST) Tags: Hardik Pandya Delhi Capitals David Warner IPL 2023 DC vs GT Gujarat Gaiants

సంబంధిత కథనాలు

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

Most Runs In IPL Final: ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే - ధోని ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?

Most Runs In IPL Final: ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే - ధోని ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?

CSK Vs GT, Final: చెన్నై కప్‌ను వదిలేసిందా - ఎంత పని చేశావు చాహర్!

CSK Vs GT, Final: చెన్నై కప్‌ను వదిలేసిందా - ఎంత పని చేశావు చాహర్!

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి