Bhuvneshwar Kumar IPL Record: మొదటి ఓవర్‌కి మొనగాడు భువీనే - ఐపీఎల్ హిస్టరీలోనే స్పెషల్ రికార్డు!
ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు.
Bhuvneshwar Kumar IPL Record: ఐపీఎల్ 2023 34వ లీగ్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్‌కు పెవిలియన్ దారి చూపి జట్టుకు తొలి వికెట్‌ను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో అత్యధికంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు అతను IPLలో మొత్తం 106 సార్లు మొదటి ఓవర్ బౌలింగ్ చేసాడు. అందులో 23 సగటుతో 23 వికెట్లు తీసుకున్నాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 5 మాత్రమే. భువీ విసిరిన బంతుల్లో 69.2 శాతం డాట్ బాల్సే కావడం విశేషం.
ఐపీఎల్ తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
భువనేశ్వర్ కుమార్ - 23 వికెట్లు
ట్రెంట్ బౌల్ట్ - 21 వికెట్లు
ప్రవీణ్ కుమార్ - 15 వికెట్లు
సందీప్ శర్మ - 13 వికెట్లు
జహీర్ ఖాన్ - 12 వికెట్లు
Half the job done ✅😎
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2023
It's time to pick up the willows 🏏💪 pic.twitter.com/MRWHWS3erU
ఇప్పటి వరకు ఐపీఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసి రాలేదు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో, ఢిల్లీ చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో ఉన్నాయి. ఈరోజు ఇరు జట్లు తమ ఏడో మ్యాచ్‌ని ఆడుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ రెండిట్లో విజయం సాధించగా, ఢిల్లీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఇరు జట్లకు చాలా కష్టంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఈ సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ ఏడు మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఫాఫ్ డు ప్లెసిస్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదోసారి యాభై పరుగుల మార్క్‌ను దాటాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ 30 సార్లు హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ టీ20 క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు. నిజానికి ఫాఫ్ డు ప్లెసిస్ రాజస్థాన్ రాయల్స్‌పై వరుసగా మూడో అర్ధ సెంచరీని సాధించాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కేవలం 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వాస్తవానికి టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కష్టాల నుంచి గట్టెక్కించాడు.