CSK vs SRH, Match Highlights: CSKను షేక్ చేసిన అభి'షేక్! కసితో ఛేజ్ చేసిన సన్‌రైజర్స్.. తొలి విజయం
CSK vs SRH, Match Highlights: హమ్మయ్య! సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎట్టకేలకు నవ్వింది. ఓ అద్భుతమైన విజయాన్ని ముద్దాడింది. CSKకి వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది.
CSK vs SRH, Match Highlights:హమ్మయ్య! సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎట్టకేలకు నవ్వింది. ఓ అద్భుతమైన విజయాన్ని ముద్దాడింది. అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు మొలిపించింది. తొలి రెండు మ్యాచుల్లో విఫలమై.. ఎందుకు తీసుకుంటున్నార్రా బాబూ అనిపించిన అభిషేక్ శర్మ (75; 50 బంతుల్లో 5x4, 3x6) ఆడితే ఇలా ఆడాలి అన్నట్టుగా విరుచుకుపడ్డాడు. ఎడమచేతి వాటంతో క్లాస్ చూపించాడు. తిరుగులేని హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా కేన్ విలియమ్సన్ (32; 40 బంతుల్లో 2x4, 1x6) , రాహుల్ త్రిపాఠి (39*; 15 బంతుల్లో 4x4, 2x6) రాణించడంతో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో సీఎస్‌కేను ఓడించింది. అంతకు ముందు మొయిన్ అలీ (48; 35 బంతుల్లో 3x4, 2x6), అంబటి రాయుడు (27; 27 బంతుల్లో 4x4) ఆడటంతో చెన్నై 154 పరుగులు చేసింది.
షేక్ చేసిన అభిషేక్
పాపం సీఎస్‌కే! ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరుసగా నాలుగో మ్యాచులో పరాజయం చవిచూసింది. తక్కువ స్కోరు చేయడం ఒకటైతే సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) చిత్తుచిత్తుగా కొట్టడం మరో కారణం. మోస్తరు టార్గెటే కావడంతో హైదరాబాద్ (Sunrisers Hyderabad) మొదట్లో ప్రెజర్ తీసుకోకుండా ఆడింది. అభిషేక్ కాస్త ఇబ్బంది పడ్డా ఒకట్రెండు షాట్లు బెటర్‌గా కనెక్ట్ అవ్వడంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో కేన్ సేన 7.5 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత జోరు మరింత పెరిగింది. 32 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కేన్ విలియమ్సన్ (Kane Williamson)తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ముకేశ్ చౌదరి వేసిన 12.1 బంతికి భారీ షాట్ ఆడబోయి విలియమ్సన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోవడంతో హైదరాబాద్ 17.4 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
మొయిన్ అలీ, అంబటి పోరాటం
డే మ్యాచ్ కావడంతో టాస్ గెలిచిన వెంటనే కేన్ విలియమ్సన్ (Kane Williamson) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు గెలవకపోవడంతో ఆట సాగుతున్నంత సేపు సన్‌రైజర్స్ ఆటగాళ్లలో ఒకరకమైన పట్టుదల, కసి కనిపించాయి. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16)ను ఎక్కువ స్కోరు చేయక ముందే ఔట్ చేశారు. జట్టు స్కోరు 25 వద్ద ఉతప్పను సుందర్, 36 వద్ద రుతురాజ్‌ను నటరాజ్ ఔట్ చేశారు.
ఈ సిచ్యువేషన్‌లో అంబటి రాయుడు (Ambati Rayudu)తో కలిసి మొయిన్ అలీ (Moeen Ali) నిలకడగా పరుగులు చేశారు. వీరిద్దరూ అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ, స్ట్రైక్ రొటేట్ చేయడంతో మూడో వికెట్‌కు 50 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. జట్టు స్కోరు 98 వద్ద రాయుడిని సుందర్ (Washinton Sundar) బలిగొన్నాడు. మరికాసేపటికే హాఫ్ సెంచరీ ముందు మొయిన్‌ను మార్‌క్రమ్ పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (3)విఫలమైనా జడ్డూ (23; 15 బంతుల్లో 2x4, 1x6) కాస్త ఆడటంతో సీఎస్‌కే 140/8కు పరిమితమైంది.
WE CLINCH OUR 1️⃣st WIN. 🧡
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2022
Chaala calm and style ga unindiga😎#CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/enU7J92R4H