PBKS vs LSG: మొన్నటి వరకు దోస్తులు! నేడు కొట్లాటకు దిగుతున్న రాహుల్, మాయాంక్
IPL 2022, pbks vs lsg preview: ఐపీఎల్ 2022లో 42వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ (Punjab kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. మరి వీరిలో ఏ జట్టు బలమైంది?
IPL 2022 pbks vs lsg preview punjab kings vs lucknow supergiants head to head records : ఐపీఎల్ 2022లో 42వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ (Punjab kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. పుణెలోని ఎంసీఏ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతంలో పంజాబ్‌కు నాయకత్వం వహించాడు. అతడి మిత్రుడైన మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఇప్పుడు పంజాబ్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. మరి వీరిలో ఏ జట్టు బలమైంది? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
PBKS vs LSG, ఎవరిది ఏ ప్లేస్
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచుల్లో 5 గెలిచింది. పాజిటివ్ రన్‌రేట్‌నే మెయింటేన్ చేస్తోంది. మరోవైపు హార్డ్ హిట్టర్లనే కొనుగోలు చేసిన పంజాబ్ మాత్రం ఆశించన రీతిలో రాణించడం లేదు. 8 మ్యాచుల్లో 4 గెలిచి 4 ఓడింది. నెగెటివ్ రన్‌రేట్‌తో ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. రాహుల్‌కు పాత జట్టు కావడం, ప్రత్యర్థి కెప్టెన్ మిత్రుడే కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
ఫామ్‌లో LSG!
లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్దగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు చేసి జోరుమీదున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు నిలిచాడంటే ప్రత్యర్థికి ఊచకోత తప్పదు. మంచి ఆరంభాలే ఇస్తున్నప్పటికీ డికాక్ మరింత నిలకడగా ఆడాలి. ఒక్క మనీశ్ పాండేనే ఇబ్బంది పడుతున్నాడు. బహుశా అతడి స్థానంలో కృష్ణప్ప గౌతమ్ లేదా మనన్ వోరాను తీసుకోవచ్చు. వోరా మూడో స్థానంలో బాగా ఫిట్ అవుతాడు. అవేశ్ ఖాన్ గాయంపై ఇంకా అప్‌డేట్ లేదు. అతడు అందుబాటులో లేకుంటే మొహిసిన్ ఆడతాడు. మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్య తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టుకు ఉపయోగపడుతున్నారు.
PBKS గెలవకపోతే?
పంజాబ్ కోరుకున్నది ఒకటి. జరుగుతున్నది మరొకటి. ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. వరుసగా గత మూడు మ్యాచుల్లో వారి ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. ఎవరూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడటం లేదు. ఓపెనర్ శిఖర్ ధావనే ఆ బాధ్యత తీసుకోవాలి. మయాంక్, రాజపక్స, లివింగ్‌స్టోన్, బెయిర్‌స్టో రాణించడం లేదు. బౌలింగ్ విషయంలో మాత్రం పంజాబ్ ఫర్వాలేదు. రాహుల్ చాహర్, అర్షదీప్, రబాడా, సందీప్ శర్మ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు. త్వరగా బ్యాటింగ్ సమస్యలను పరిష్కరించకపోతే పంజాబ్ ఇంటికెళ్లడం ఖాయం.
PBKS vs LSG Probable XI
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ /మొహిసిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, రిషి ధావన్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ
It’s #LSGvsPBKS!
— Lucknow Super Giants (@LucknowIPL) April 29, 2022
Get your #SuperGiant roars ready!#AbApniBaariHai💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL pic.twitter.com/uB0dTPt2Vj