IPL 2022, PBKS vs KKR: నేడు హిట్టర్ల పండుగ! కోల్‌కతా ఆధిపత్యానికి పంజాబ్ తెరదించేనా?
pbks vs kkr preview ఐపీఎల్ 2022 ఎనిమిదో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్? ఎవరిపై ఎవరిది పై చేయి?
IPL 2022, PBKS vs KKR: ఐపీఎల్ 2022 ఎనిమిదో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. ఈ మ్యాచుకు వాంఖడే వేదిక. 206 టార్గెట్‌ను ఊడ్చేసిన పంజాబ్ జోరు మీదుంటే రెండో మ్యాచులో పరాజయంతో కోల్‌కతాలో పట్టుదల మరింత పెరిగింది. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్? ఎవరిపై ఎవరిది పై చేయి? ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు.
KKRదే పైచేయి
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (PBKS vs KKR) తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడగా కేకేఆర్ ఏకంగా 19 సార్లు గెలిచింది. పంజాబ్ 10 విజయాలకే పరిమితమైంది. రీసెంట్‌గా ఆడిన ఆఖరి ఐదింట్లోనూ 3-2తో కేకేఆర్‌దే పైచేయి. అయితే గతేడాది చెరో మ్యాచ్ గెలిచారు.
హిట్టర్లదే రాజ్యం!
ప్రస్తుత సీజన్లో రెండు జట్లు బలంగా మారాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. రెండు జట్లలోనూ కావాల్సినంత మంది హిట్టర్లు ఉన్నారు. బెంగళూరుపై 206 టార్గెట్‌ను ఛేదించిన పంజాబ్ మంచి జోష్‌లో ఉంది. పైగా ఆ జట్టులోకి ఇప్పుడు కాగిసో రబాడా వచ్చాడు. దాంతో డెత్, పవర్‌ప్లే బౌలింగ్ మరింత పటిష్ఠంగా మారనుంది. ఒడీన్ స్మిత్ వీరబాదుడు ఆకట్టుకుంది. ఇక కేకేఆర్ ఒక మ్యాచ్ గెలిచి ఒకటి ఓడింది. రెండో మ్యాచులో ముఖ్యంగా ఒకరకమైన నిర్లక్ష్యం కనిపించింది! పిచ్, కండీషన్స్‌ను పట్టించుకోకుండా తర్వాత వచ్చేవాళ్లు బలమైనవాళ్లేనని భావించి అనవసర షాట్లు ఆడి బొక్కబోర్లా పడ్డారు. 14 ఓవర్లకే 8 వికెట్లు పోగొట్టుకున్నారు. బహుశా ఈ మ్యాచులో మరింత జాగ్రత్తగా ఆడే అవకాశం ఉంది. వాంఖడేలో టాస్ గెలిచిన వారిదే దాదాపుగా గెలుపు కానుంది.
PBKS vs KKR Probable Teams
కోల్‌కతా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రసెల్ / చామిక కరుణరత్నె /మహ్మద్ నబీ, సునిల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్‌బావా, షారుఖ్ ఖాన్, ఓడీన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్
𝗦𝗵𝗲𝗿 𝗵𝗮𝗶𝗻 𝘁𝗮𝗶𝘆𝗮𝗮𝗿 𝗳𝗼𝗿 #𝗞𝗞𝗥𝘃𝗣𝗕𝗞𝗦 👊#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/ZHJyWN93kS
— Punjab Kings (@PunjabKingsIPL) April 1, 2022