IPL 2022, MI vs LSG: కేఎల్ 100 ఐపీఎల్ మ్యాచ్.. లక్కీగా టాస్ గెలిచిన రోహిత్
ipl 2022 mi vs lsg live updates: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
IPL 2022 mi vs lsg live updates mumbai indians win the toss and choose to bowl first against lucknow supergiants: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఛేదనకు మొగ్గు చూపించాడు. ముంబయి జట్టులో ఒక మార్పు చేసింది. ఫాబియన్ అలన్‌కు చోటిచ్చింది. లక్నోలో కృష్ణప్ప గౌతమ్ స్థానంలో మనీశ్ పాండే వచ్చాడు. ఇది కేఎల్ రాహుల్‌కు వందో ఐపీఎల్ మ్యాచ్.
వేధిస్తున్న పొరపాట్లు
సూపర్ 'డెప్త్'
ఈ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) తన డెప్త్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది. విస్తృతంగా బౌలింగ్ ఆప్షన్లు ఉండటంతో రాజస్థాన్ మ్యాచులో కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా అసలు బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఎనిమిదో నంబర్లో స్టాయినిస్ వస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తోంది. చెన్నై, దిల్లీపై రన్‌ఛేజ్‌లో డికాక్ 61, 80తో సాలిడ్‌గా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ (KL Rahul), ఆయుష్ బదోనీ, దీపక్ హుడా నిలకడగా రాణిస్తున్నారు. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య బౌలింగ్ బాగుంది. అయితే డెత్‌లో లక్నో విదేశీ పేసర్లు పరుగుల్ని కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే పవర్‌ప్లేలో లైన్ అండ్ లెంగ్త్‌ను త్వరగా పసిగట్టలేకపోతున్నారు.
లక్నో సూపర్‌జెయింట్స్ (LSG Playing XI): కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, మనీశ్ పాండే, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డీవాల్డ్ బ్రూవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, తైమల్ మిల్స్, ఫాబియన్ అలన్
🚨 Toss Update 🚨@ImRo45 has won the toss & @mipaltan have elected to bowl against @LucknowIPL.
— IndianPremierLeague (@IPL) April 16, 2022
Follow the match ▶️ https://t.co/8aLz0owuM1#TATAIPL | #MIvLSG pic.twitter.com/LUWdKJuBsg